Friday, September 18, 2009

'ఎదుటివాళ్ళకి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి'

[రాష్ట్ర డీజిపీలు, ఇతర పోలీసు ఉన్నతోద్యోగుల సమావేశాల ముగింపు సందర్భంలో, ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్, పాక్ నుండి అధికసంఖ్యలో చొరబాటుదారులు భారత్ లోకి ప్రవేశించే ప్రమాదం ఉందని, హెచ్చరిక చేసిన వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
పాక్ నుండి చొరబాటుదారులు వాస్తవాధీన రేఖ, మొదలైన ప్రదేశాల ద్వారా భారత్ లోనికి ప్రవేశిస్తున్నారట. పోలీసు ఉన్నతాధికారులు అప్రమత్తంగా ఉండాలని భారత్ ప్రధాని హెచ్చరిస్తున్నాడు. ఇతరులకి ఇన్ని జాగ్రత్తలు చెబుతున్న ఈయన, ఆమధ్య ఈజిప్టు వెళ్ళి, హడావుడిగా, పాక్ ప్రధాని జిలానీతో, స్వంత ఏజండాతో మరీ చెట్టాపట్టాలెందుకు వేసుకుని వచ్చినట్లు బావా?

సుబ్బారావు:
ఇతరులకి ఇన్ని హెచ్చరికలు చెబుతున్న సదరు ప్రధాని గారి అధ్వర్యంలోని యూపిఏ ప్రభుత్వం, ఢిల్లీమీదుగా లాహోర్ నుండి ఢాకా దాకా రైలుబండిని నడపాలని పాక్ కి ప్రతిపాదనలు ఎందుకు పంపినట్లు? ఆ ప్రతిపాదనకి పాకిస్తాన్ పరమానందంగా అంగీకారం తెలిపిందని పాకిస్తాన్ ’డాన్’ పత్రిక అందట. నీకు తెలియదా?

సుబ్బలష్షిమి:
అందుకేనేమో బావా! ‘ఎదుటివాళ్ళకి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి’ అన్నాడు వెనకటికి ఓ సినీకవి.

3 comments:

  1. అయినా అవి ఇప్పుడే ప్రారంభమయినట్లు,వీళ్ళేదో గట్టి భద్రతాచర్యలు తీసుకుంటున్నట్లు.దొరికిన తీవ్రవాదులకు శిక్షలు వేయకుండా సకల సౌకర్యాలు అందిస్తారు.పాకిస్తాన్ లో ఉండే తీవ్రవాదులను మాకప్పగించండని డిమాండ్ చేస్తారు.

    ReplyDelete
  2. బంగ్లాదేశ్ని పాకిస్తాన్నుండి విడగొట్టింది మనమే కదా!
    ఇప్పుడు మరలా కలిపే ప్రయత్నమేమో!

    ReplyDelete
  3. విజయమోహన్ గారు,

    మీరన్నది నిజమే!
    ******
    చందమామ గారు,

    ఉన్నది ఊడగొట్టక పోతే సరి!

    ReplyDelete