Thursday, September 24, 2009

ఇడుపులపాయకు ఇరుముడులు

[అనంతపురం నుండి కాంగ్రెస్ కార్యకర్తలు ఇరుముడి కట్టుకొని, వై.యస్.దీక్ష, మాలా ధరించి ఇడుపుల పాయలోని వై.యస్. సమాధిని దర్శించారన్న వార్తల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
శివదీక్ష, భవానీ దీక్షల్లాగా ఇరుముడి కట్టుకొని ఇడుపులపాయపోయారట కొందరు కార్యకర్తలు! వై.యస్. క్రైస్తవుడు కదా! క్రైస్తవ సంప్రదాయం ప్రకారమే అతడి భౌతిక దేహాన్ని, దహనం కాకుండా ఖననం చేసి, సమాధి చేసారు కదా! తమ భక్తిని ప్రకటించుకోవాలంటే క్రైస్తవ సంప్రదాయం ప్రకారమే ఏదో ఒకటి చేసుకోకుండా, హిందూ దేవుళ్ళకి చేసినట్లు ఇరుముడి కట్టుకొని దీక్ష తీసుకోవటం ఏమిటి బావా? మరీ ఎకసెక్కంలా లేదూ?

సుబ్బారావు:
ఎకసెక్కం సంగతలా ఉంచు మరదలా! నాకో సందేహం! శివదీక్షో, భవానీ దీక్షో అంటే దైవసంబంధం గనుక అబద్దాలాడ కూడదు, మద్యమాంసాలు ముట్టకూడదు, ఇతరుల్ని బాధించకూడదు గట్రా నియమనిష్టలుంటాయి. మరి ఈ రాజకీయనాయకుడి దీక్ష ధరించిన వాళ్ళు, బ్రతికుండగా అతడు చేసినవన్నీ చేస్తారా? అంటే ఎదురు తిరిగిన వాణ్ణి అణగదొక్కటం, ఇంకా ఎదురు తిరిగితే, కేకే వంటి వారి కొడుకుల్ని కేసుల్లో ఇరుక్కునేటట్లు చేయడం వంటివన్న మాట.

సుబ్బలష్షిమి:
!!!

3 comments:

  1. నిజం నిష్టూరం గా వుంటుంది.
    పదవి నిమిత్తం బహుకృత వేషం
    అందరికీ జగన్ సంస్థలలో పెట్టుబడులున్నాయి.అవి పోతే..?
    రా.శే.రె. నిజంగా గొప్ప వ్యక్తి. తనున్నా లేకున్నా తన జగత్తు వుండాలనుకున్నాడు. అదే జరిగింది. జగమెరిగన సత్యం .

    ReplyDelete
  2. నాకూ అదే అనిపించింది. అసలే వై.ఎస్. బెల్టు షాపులకు ప్రస్సిద్ధి ! వీళ్ళు మద్యం తాగుతూ వై.ఎస్. మాల వేసుకుంటారా / మద్యం తాగకుండానా !? ఎలా చేస్తే వై.ఎస్. కు గౌరవం ఇచ్చినట్టు ?

    ReplyDelete
  3. సుజాత గారు,

    మన సందేహాలని తీర్చేదెవరు?

    ReplyDelete