Friday, February 4, 2011

మాటలకీ చేతలకీ పొంతన ఎంత? రోల్స్ రాయల్స్ కారంత!

[ప్రరాపా అధినేత చిరంజీవి ఇటీవల 5 కోట్ల రూపాయల విలువ చేసే రోల్స్ రాయిల్స్ కారు కొన్న వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ప్రజారాజ్యం అధినేత చిరంజీవి, ఇటీవల 5కోట్ల రూపాయల విలువ చేసే అత్యంత విలాసవంతమైన రోల్స్ రాయిల్స్ కారుని కొన్నాడు. సిరిసంపదల ప్రదర్శన పట్ల ఎంత మోజు ఈ ప్రజా నాయకుడికి? ఇంకా ఇతడు ప్రజల కష్టాలూ కన్నీళ్ళ గురించి ఉపన్యాసాలిస్తాడు. రిక్షాలోంచి సరుకులు, రెండు చేతుల్లో మోసుకొచ్చిన తనకి, కష్టాలెలా ఉంటాయో తెలుసని స్వయం కితాబులిచ్చుకుంటాడు.

సుబ్బారావు:
అతడు సినిమా నటుడిగా ఉన్నప్పుడు ఎంత సంపాదించుకున్నా, సంపాదించుకున్న దాంతో ఎన్ని విలాసాలు పోయినా, సౌఖ్యాలనుభవించినా… ఎవరూ పట్టించుకోరు మరదలా! అప్పుడది అతని వ్యక్తిగత వ్యవహారం అనుకునే వాళ్ళు. రాజకీయాల్లోకి వచ్చాక, అతడి మాటలకీ చేతలకీ… పొంతన పరిశీలిస్తారు కదా!

ఏం చేస్తాం? విలాస పురుషులు ప్రజానాయకులై పోయారు. ఈ విలాసాల పట్ల మోజులున్న వాళ్ళకి, అవి పోతాయంటే ఎంతటి రాజీ అయినా పడతారు మరదలా!

సుబ్బలష్షిమి:
అదే కదా, ఇప్పుడు చిరంజీవి నిరూపించుకుంటున్నది? ప్రజల సహన పరిమితి, గుడ్డి అభిమానపు పరిధీ…ఎంత మేరకు ఉన్నాయో వేచి చూడాల్సిందే బావా!?

1 comment:

  1. అప్పుడు గంజి నుంచి బెంజికి,
    ఇప్పుడు రోల్స్ రాయస్ నుంచి గడ్డి కి,
    భూమి గుండ్రం గా ఉండును,
    సూర్యుడు తూర్పున ఉదయించును,
    రాజకీయాల్లో ప్రమాణాలు ఉండవు
    ఒక్క పదవీ ప్రమాణం తప్ప.

    ReplyDelete