Thursday, February 3, 2011

తాను పెట్టిన కళ్ళద్దాలలోంచే, ప్రజలు ప్రపంచాన్ని చూడాలన్నది మీడియా ఆకాంక్ష!

[ఇద్దరూ తమిళ తంబిలే! ఒకరు చోరుడు (రాజా), మరొకరు యోధుడు (సుబ్రమణ్య స్వామి) – వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! స్వతంత్ర భారత దేశ చరిత్రలోనే పెద్దదైన 2జీ స్ప్రెక్ట్రం అవినీతి వ్యవహారానికి కారకుడైన రాజా చోరుడని (ఈనాడు) మీడియా ఉటంకించింది. అది పచ్చి నిజం! పోతే… దాన్ని వెలుగులోకి తీసుకొచ్చి, తీవ్రంగా పోరాడిన సుబ్రమణ్య స్వామిని యోధుడని కితాబులిచ్చింది, చూసావా?

సుబ్బారావు:
అవును, మరదలా! ఒకప్పుడూ… ఈ సుబ్రమణ్య స్వామి, ఏదోక వ్యవహారాన్ని బయటకి తీసేవాడు. అయితే, అప్పట్లో మీడియా, ప్రత్యేకించి ఈనాడు, ఇతడికి `అంతర్జాతీయ విదూషకుడ’ని కితాబులిచ్చింది. ఇప్పుడు అవసరాలు మారాయో లేక పరిస్థితులు ముంచుకొచ్చాయో గానీ, యోధుడంటోంది.

సుబ్బలష్షిమి:
బహుశః పరిస్థితులే పీకల మీదికి వచ్చి ఉంటాయి బావా! లేకపోతే మీడియా… తాను గోల చేయదలుచుకున్న వ్యవహారాలనే బయటకి తెస్తుంది తప్ప,తమ వారికి తలనొప్పి తెచ్చే వ్యవహారాలని, తాను వెలికీ తీయదూ, వేరెవరైనా వెలికి తీసినా… వాళ్ళని విదూషకులనో, మానసిక రోగులనో ప్రచారిస్తుంది. ఎన్ని సార్లు ఇలాంటివి చూడలేదు?

సుబ్బారావు:
అంతే మరదలా! తాను పెట్టిన కళ్ళద్దాలలోంచే, ప్రజలు ప్రపంచాన్ని చూడాలన్నది మీడియా ఆకాంక్ష!

3 comments:

  1. నాకు తెలిసి సుబ్రహ్మణ్యస్వామి పాపులర్ కాకుండా మీడియా అడ్డుపడింది అని.. స్వామి పై మీ అభిప్రాయం కూడా చెప్పండి.. ఈ స్వామి సొనియా పై కేసులు కూడా పెట్టి ఉన్నాడు.. మీకు ఇంతకు ముందు లింక్స్ ఇచ్చాను... కానీ మీరేం సమాధానం ఇవ్వలేదు..

    ReplyDelete
  2. కిరణ్ గారు: మీరు సుబ్రమణ్య స్వామి గురించి గతంలో వ్రాసిన వ్యాఖ్య గుర్తుందండి. అతడి గురించి తరువాత ఎప్పుడైనా! నెనర్లు.

    ReplyDelete
  3. సుబ్రమణ్య స్వామి గారు తనని కంచి పెద్ద స్వామి చంద్రశేఖర సరస్వతి భారత దేశం గురించి చెప్పి, ఈదేశాన్ని ఎప్పుడు ఒకే ఒక్క వ్యక్తి కృషి వలన తన అస్తిత్వాన్ని నిలబేట్టుకొని వస్తున్నాది. ఆది శంకరాచార్య, గాంధి లాంటి వారి కృషివలన ఇప్పటికి ఈ దేశం ఒకతాటి పైనిలబడింది. కనుక మీరు కూడా పదవి ఉన్న లేక పోయినా, పేరు ప్రఖ్యాతుల కన్నా, నీతి నిజాయితిగా దేశానికి సేవచేయండి అని కోరారని. స్వామికి ఆయన మాటనిచ్చానని చెప్పుకొన్నారు. కనుకనే సుబ్రమణ్య స్వామి గారు ఎప్పటి కప్పుడు తన విచక్షణ తో ఎవరి వైపు న్యాయం ధర్మం ఉందో వారికి మద్దతు నిచ్చారు. అది బయటనుంచి చూస్తే సామాన్య ప్రజలకు ఇతడు పూటకో పార్టి మార్చే వాడిలా కనబడతాడు. కాని ఈ మధ్య నెట్ వలన మనకు అన్ని విషయాలు తెలుస్తున్నాయి గనుక ఎవరు ఎంత నీజాయితి పరులో మన మనసుకే తెలుస్తుంది.
    ధైర్యము,తెగువా, మంచి తెలివితేటలుగల ఒక వ్యక్తి సిద్దాంత రాద్దంతాలు లేకుండా ఒక్కచేతితో దేశానికి ఎంత సేవ చేయగలవచ్చో అని నిరూపించటానికి శ్రీ సుబ్రమణ్య స్వామి గారు ఒక ఉదాహరణ. ఇతనొక రాజకీయ ఋషి.
    SRI RAM

    ReplyDelete