Tuesday, October 6, 2009

భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఎక్కడ? వరదల్లో కొట్టుకు పోలేదు కదా!

[పోతిరెడ్డిపాడు జలాశయం కోసం, శ్రీశైల జలాశయపు కనీస నీటి మట్టాన్ని పెంచటం వల్లే, కర్నూలు నగరాన్ని వరద ముంచెత్తిందన్న వార్తల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! వరదలిలా రాష్ట్రాన్ని ముంచెత్తుతుంటే భారీ ప్రాజెక్టులూ, నీటిపారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అడ్రసు లేడేమిటి? వై.యస్. బ్రతికుండగా, చీటికి మాటికి టీవీ వార్తల్లో కనపడి, వై.యస్. చెప్పిన ప్రతి విషయానికి ’తాన అంటే తందాన’ చెప్పే వాడు కదా?

సుబ్బారావు:
తమ వ్యక్తిగత ప్రతిష్ఠ, వ్యక్తిగత లబ్ధికోసం, వై.యస్. తో కలిసి, పోతిరెడ్డిపాడుని ప్రముఖంగా చూపించేందుకు శ్రీశైలం జలాశయ కనీస నీటిమట్టాన్ని పెంచారు. ఇంజనీర్ల బదులు ఈ రాజకీయనాయకులే సాంకేతిక నిర్ణయాలు తీసేసుకున్నారట తెలుసా? దాంతో ఇప్పుడు వరద నీరు వెనక్కి తన్ని, నగరాలు నీట మునిగాయి. ఏం చేస్తాడు మరి?

సుబ్బలష్షిమి:
ఓ రకంగా చెప్పాలంటే వై.యస్. చచ్చిబ్రతికి పోయాడన్న మాట! ఇక ఈ పొన్నాల లక్ష్మయ్య వంటి భక్త మంత్రులకి, బయటికొస్తే ప్రజలెక్కడ శాపనార్ధాలు పెడతారోనని భయం వేసి లోపల కూర్చున్నారన్న మాట.

~~~~~~

4 comments:

  1. పొన్నాల ఏంటి? ఇంకా చాలా మంది మంత్రులు కనపట్టంలేదు.మా జిల్లా కాదనా? జనాలు తంతారనా??

    ReplyDelete
  2. జ్యోతి గారు,

    EVM ఉండగా తొక్కలో ప్రజలు అనుకుంటూ ఉండి ఉంటారేమో!

    ReplyDelete
  3. చెప్పుకునేదానికి,ప్రచారం చేసుకునేదాన్ని మరచిపోయేటంత ప్రజాసేవలో మమేకమై పోయారులెండి అందుకే కనిపించడంలేదు.

    ReplyDelete
  4. విజయమోహన్ గారు,

    నిజమే సుమండీ!

    ReplyDelete