Tuesday, January 11, 2011

ఎదుటి వాళ్ళకీ చెప్పేటందుకే నీతులు ఉన్నాయి, డోంట్ కేర్!

[విచక్షణాధికారాలు వదులుకోండి నిరాడంబరతకు పెద్ద పీట వేయాలని ఉద్భోద. కాంగ్రెస్ సీఎంలకు సోనియా లేఖలు – ఈనాడు (08 జనవరి, 2011) వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! కాంగ్రెస్ అధిష్టానం సోనియా, కాంగ్రెస్ సీఎంలకి తమ విచక్షణాధికారాలని వదులు కోవాలనీ, నిరాడంబరతకు పెద్ద పీట వేయాలనీ ఉద్భోదించిందట, తెలుసా?

సుబ్బారావు:
అందుకే కాబోలు, కాంగ్రెస్ శాసన సభా సమావేశాల్లో, కాంగ్రెస్ ప్లీనరీల్లో అంతిమ నిర్ణయం అధిష్టానానిదే అంటు ఏక వాక్య తీర్మానాలు చేయించుకుంటూ ఉంటుంది. గజమాలలు మెడలో వేయించుకుంటూ ఉంటుంది. అంటే విచక్షణాధికారాలు తనకి మాత్రమే ఉండాలనీ, నిరాడంబరత తనకి తప్ప అందరికీ ఉండాలనీ అధిష్టాన దేవత అభీష్టం కాబోలు మరదలా!

సుబ్బలష్షిమి:
అంతే బావా! అప్పుడెప్పుడో ‘ప్రేమ్ నగర్’ సినిమాలోని పాట ‘ఎదుటి వాళ్ళకీ చెప్పేటందుకే నీతులు ఉన్నాయి, డోంట్ కేర్’ అన్నదే సోనియా ఆదర్శం అయి ఉండొచ్చు.

3 comments:

  1. neetulE kaadu ,manaku laabhinchEdhi edainaa anthE.

    ReplyDelete
  2. ఆదిలక్ష్మి గారూ !
    మీకు, మీ కుటుంబానికి సంక్రాంతి శుభాకాంక్షలు.
    అమ్మ ఒడి బ్లాగులో వ్యాఖ్యలు ప్రచురించడానికి వీలు కావడంలేదు. పరిశీలించగలరు.
    http://sirakadambam.blogspot.com/2011/01/blog-post_16.html

    ReplyDelete
  3. SR Rao గారు:మీకు, మీ కుటుంబానికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలండి. అమ్మఒడి బ్లాగులో వ్యాఖ్యలు ఎందుకు ప్రచురింపబడటం లేదో నాకూ అర్ధం కావటం లేదండి! దృష్టికి తెచ్చినందుకు నెనర్లు!

    ReplyDelete