Sunday, March 13, 2011

ఇలా చేస్తే దెబ్బకి పదిహేను రోజుల్లో తెలంగాణ వచ్చితీరుతుంది!

[పదిలక్షల మందితో మొన్నటి మిలియన్ మార్చ్ నిర్వహించిన తెలంగాణా ఉద్యమనేతలు, రానున్న మేలో మరోసారి హైదరాబాద్ దిగ్భందానికి పూనుకుంటామని ప్రకటిస్తున్న నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! 30 రోజులుగా సహాయ నిరాహరణ చేస్తామన్న తెలంగాణా ఉద్యోగులు, ఒకటో తారీఖు జీతాల రోజు రాగానే, ఎంచక్కా దాన్ని చర్చల పేరుతో విరమించేసి, జీతాలు, (ఉద్యమ నాయకులు దండిగా డబ్బులు కూడా) పుచ్చుకుని ఇంటి కెళ్ళిపోయారు. వెరసి బందులూ, సహాయ నిరాకరణలూ వంటి వాటితో బ్రతుకు భారమైనది జనాలకే!

ఇటు చూస్తే..... మిలియన్ మార్చ్ అంటూ, అష్ట దిగ్భందం అంటూ ఇన్ని గొడవలు పెట్టి, వీళ్ళు ఉద్యమాన్ని ఏం చెయ్యాలనుకుంటున్నారో?

మరోప్రక్క..... ‘ఉద్యమం ప్రజల చేతుల్లోకి వెళ్ళిపోయింది, అందుకే విగ్రహాలు ధ్వంసం చెయ్యబడ్డాయి’ అని ప్రకటిస్తున్నారు. ఏమిటిదంతా! ఇలా చేస్తే తెలంగాణా వస్తుందా?

సుబ్బారావు:
ఇదంతా వృధా మరదలా! స్వాతంత్ర సమరం రోజుల్లో, సత్యాగ్రహులు ఒకరి వెనక మరొకరుగా..... వేలూ లక్షల మంది ఉద్యమించే సరికి, ఎందర్నని జైల్లో పెట్టగలదు నాటి బ్రిటీషు ప్రభుత్వమైనా? ఎంతగా రవి అస్తమించనిదైనా, నోరు మూసుకుని తలవొంచుకుంది.

అలాంటి చోట.... ఈ తెలంగాణా ఉద్యమ నేతలు కూడా..... ఎటూ ఉద్యమం ప్రజల చేతుల్లోకి వెళ్ళిందంటున్నారు కదా, పదో పాతికో లక్షల మందితో పాటు, అన్నిపార్టీల నేతలూ, అనుచరులూ..... జింఖానా గ్రౌండ్స్ దగ్గరి నుండి మైదానాలన్నిటిలో, ఆమరణ నిరాహార దీక్షలు చేపడితే సరి!

ప్రభుత్వం.... ఒక్క కేసీఆర్ నంటే, అసుపత్రికి తరలించి టీపీఎన్ లిచ్చింది గానీ, లక్షల మందికేం ఇచ్చి ఛస్తుంది!?

సుబ్బలష్షిమి:
నిజమే బావా! అలా చేస్తే, దెబ్బకి పదిహేను రోజుల్లో తెలంగాణా వచ్చి తీరుతుంది. మిలియన్ మార్చ్ లూ, చారిత్రక చవట తనాలూ అనవసరం.

4 comments:

  1. అదిరింది అమ్మాయ్ ...

    ReplyDelete
  2. తెలంగాణ వచ్చినాక కెసిఆర్ కి ఉడిగం చేయండి

    ReplyDelete
  3. "తెలంగాణా ఉద్యోగులు , ఒకటో తారీఖు జీతాల రోజు రాగానే, ఎంచక్కా దాన్ని చర్చల పేరుతో విరమించేసి, జీతాలు పుచ్చుకుని ఇంటి కెళ్ళిపోయారు."

    its not true...most of the employees didn't get salaries yet..and they participated in pen down strike by force

    ReplyDelete
  4. ఆహార సమస్య కూడా కొద్దిగా తీరుతుంది. జంటనగరాల్లో ధరలు 20% మేర తగ్గినా తగ్గొచ్చు. :)
    వీళ్ళు మద్యం తాగకున్నా ఆదాయం పడిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే తెలంగాణ ఇచ్చేస్తారు, తాగము అంటే ప్రజల మద్దతు వుంటుందో లేదో! :P :)

    ReplyDelete