[మిలియన్ మార్చ్ మూడు గంటలే – ఐకాస ఛైర్మన్ కోదండరాం వెల్లడి – వార్త నేపధ్యంలో]
సుబ్బలష్షిమి:
బావా! దాదాపు రెండువారాల క్రితం..... మార్చి పదో తేదిన ‘హైదరాబాద్ ని దిగ్భంధం చేస్తామనీ, చీమని కూడా కదలనివ్వమనీ’ హుంకరించారు ఐకాస ఛైర్మన్ కోదండరాం, కేసీఆర్ లూ!
అప్పటికే ఖరారైన ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ని వాయిదా వేసుకోవాల్సిందిగా ప్రభుత్వానికి అల్టిమేటంలూ ఇచ్చారు. పరీక్షలున్నా గానీ.... విద్యార్ధుల భవిష్యత్తు ఏమైనా గానీ.... ఉద్యమం మా ఊపిరి, పది లక్షల మందితో కదం తొక్కిస్తాం అంటూ గర్జించారు.
మరి ఢిల్లీ బాసులకీ, తెరాస నేత కేసీఆర్ కీ మధ్య ఏ మంతనాలు నడిచాయో గానీ... ముందుగా కేసీఆర్, మిలియన్ మార్చ్ ని నీరు గార్చే ప్రయత్నం ప్రారంభించాడు.
మెల్లిగా క్రిందికి పాకిన అదే తీరు.... కోదండరాం నుండి ‘మూడు గంటల ప్రకటన’ దగ్గరికి చేరింది, చూసావా!
సుబ్బారావు:
కేసీఆర్ రిమోటు సోనియా చేతిలో ఉంది. కోదండరాం రిమోటు కేసీఆర్ చేతిలో ఉంది. అలాంటప్పుడు అక్కడి తీరు ఇక్కడ ప్రతిఫలించడం సహజమే కదా మరదలా!
లేకపోతే.... ‘చీమని కూడా కదల నివ్వం’ అనే రోజున తెలియదా పరీక్షలు వ్రాసే విద్యార్ధులకు ఇబ్బంది కలుగుతుందని?
సుబ్బలష్షిమి:
బహుశః దడదడ లాడించ గలం అనుకుని ఉంటారు బావా! పైనుండి క్రింది దాకా.... ఏ పరిస్థితి మారిందో, ప్రస్తుతం గడగడలాడుతున్నారు.
సుబ్బారావు:
ఏదేమైనా పరిస్థితులకీ కెరీర్ కీ, పైసలకీ సంబంధం ఉంటుంది మరదలా! బాసిని మాట వినకుండా... ఉద్యమం అంటూ ఉరికితే ‘కెరీర్ కీ, పైసలకీ గండి పడటం ఖాయం’ అన్న సూత్రం తెలియని వాడు కాదు కేసీఆర్!
Subscribe to:
Post Comments (Atom)
me ammaodi blog lo epudu Nakili Kanikudu ane maata vaadataru... daani ardham emiti... asalu emi ardham kaadu
ReplyDeleteశ్రీదేవి గారు: అమ్మఒడి బ్లాగు ఆర్కేవ్ లో అన్ని టపాలు ఒకే చోటలో వివరాలు ఉంటాయండి. కొంచెం ఓపిక చేసుకుని చదవాలి! కణికుడు, నకిలీ కణికుడు అర్ధమైతేనే నా టపాలు మీకు అర్ధమవుతాయండి. నెనర్లండి!
ReplyDelete