Wednesday, October 13, 2010

`రామోజీ రహస్యాలపై నోరెత్తరేం?' అనే కంటే సహ చట్టం క్రింద అడగొచ్చుగా!

[పన్ను మీదా కుట్రే. జగన్ పద్దతిగా పన్ను కట్టటమే నేరంగా పత్రికల్లో వార్తలు, టీవీల్లో స్టోరీలు. రామోజీ రహస్యాలపై నోరెత్తరేం? -సాక్షి కథనం నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! వై.యస్.జగన్ భారతీ సిమెంట్స్‌లో తన వాటాను అమ్మడంతో వచ్చిన ఆదాయంలో, చట్టప్రకారం 20%, అంటే 84 కోట్ల రూపాయలు ఆదాయపన్ను అడ్వాన్సుగా కట్టాడట. దాని మీద రామోజీరావు+చంద్రబాబు&కో కలిసి, పచ్చ నాటకం ఆడుతున్నారని జగన్ తన సాక్షి పత్రికలో వ్రాసుకున్నాడు.

‘రామోజీ రహస్యాలపై నోరెత్తరేం?’ శీర్షిక క్రింద

>>>సాక్షి, 13 అక్టోబరు,2010; 2వ పేజీ
ఎల్లో సిండికేట్ సూత్రధారి రామోజీరావు పుట్టెడు నష్టాల్లో ఉన్న తన గ్రూపు కంపెనీల్లో వాటాలను రెండేళ్ళ కిందట విక్రయించారు. 100 రూపాయల విలువగల ఒకో షేరును ఏకంగా 5,28,830/-రూపాయల చొప్పున విక్రయించారు. తద్వారా రెండు విడతలుగా రూ.1700 కోట్లు సమీకరించారు. రామోజీ తన వ్యక్తిగత వాటాను విక్రయించారు కాబట్టి చట్టప్రకారం 20శాతం అంటే... రూ.340 కోట్లు ఆదాయపు పన్నురూపంలో చెల్లించి ఉండాలి. దీన్ని ఏ ఇతరత్రా నష్టాల్లో సర్ధుబాటు చేశారో... లేకుంటే తక్కువ మొత్తమే వచ్చిందని చెప్పి తక్కువ పన్నుకట్టారో.. లేదంటే ఈ డీల్ బయటకు ఎవరికీ తెలియదు కదా అని పన్ను ఎగ్గొట్టారో... ఏ సంగతి బయటప్రపంచానికి తెలియదు. ఎందుకంటే రామోజీ కోటలో ప్రతిదీ రహస్యమే. పన్ను ఎగవేతకు సంబంధించి ఆయనపై ఎన్ని ఆరోపణలొచ్చినా బాబు కిమ్మనకుండా ఉంటారు తప్ప నిజం చెప్పండని నిలదీయరు. ఎందుకంటే అదంతా వారి ‘సొంత’వ్యవహారం. నష్టాల్లో ఉన్న కంపెనీ వాటాల్ని భారీ ప్రిమియానికి అమ్ముకుని పన్ను ఎగ్గొట్టిన రామోజీ చేసింది మాత్రం కరెక్టు. మరీ ఇంత సిగ్గుమాలినతనమా బాబూ...?

బావా, పత్రికలో ఇంత గోల పెట్టేబదులు... ఎటూ రామోజీరావు సహ చట్టాన్ని భుజానేసుకుని ముందడుగు వేస్తున్నానంటాడు కదా!... అదే బాటలో ‘సహచట్టం’ క్రింద రామోజీరావు పన్ను కట్టాడో, ఎగ్గొట్టాడో అడగవచ్చు కదా!? అప్పుడు సాక్ష్యాలతో సహా, రహస్యాలు బయటికి వస్తాయి కదా!?

సుబ్బారావు:
ఎంత అమాయకురాలివి మరదలా! అంత లోతుగా రహస్యాలు లాగుతారేంటి? ఏదో పత్రికలో పైపైన అలా అంటారంతే! లేకపోతే తమ రహస్యాల గోచీలనీ, ఎదుటి వాళ్ళు అలాగే లాగుతారు కదా? అదీగాక... సహచట్టం క్రింద అడిగినా ప్రభుత్వం ఏ రహస్యాలనైనా బయటపెడుతుందను కున్నావా? ఏదో సొల్లు సంగతులు తప్ప, కీలకమైన విషయాలైతే... ఏదో ఒక వంక చూపిస్తుంది తప్ప, చచ్చినా సమాచారం ఇవ్వదు గాక ఇవ్వదు.

సుబ్బలష్షిమి:
అంతేనా? ‘సహ చట్టం ఆహా ఒహో!’ అంటే... అవునేమో అనుకున్నాను బావా!

4 comments:

 1. హ్మ్.. సమాచార హక్కు చట్టం కింద వ్యక్తిగత వివరాలు ఇవ్వాలంటే, ఆయా వ్యక్తుల అనుమతి లభించినతరువాత మాత్రమే ప్రభుత్వం ఇవ్వగలుగుతుందండీ.

  సమాచార హక్కు ని ఇంకొంచెం పదునెక్కించాలంటే ఏ ఏ మార్పులు చెయ్యలో ఆలోచించకుండా..

  >>"ఏదో సొల్లు సంగతులు తప్ప, కీలకమైన విషయాలైతే... ఏదో ఒక వంక చూపిస్తుంది తప్ప, చచ్చినా సమాచారం ఇవ్వదు గాక ఇవ్వదు."

  ఇలాంటి అభిప్రాయాలని పెంపొందించడం నాకైతే నచ్చలేదు. క్షమించగలరు..

  ReplyDelete
 2. RTI can't be used in this case.....

  ReplyDelete
 3. వీకెండ్ పోలిటీషియన్ గారు,

  మీకు సమాచారం కోసం చెబుతున్నాను. ఆ మధ్య ఒకరు సహచట్టం క్రింద లాల్ బహదూర్ శాస్త్రి తాష్కెంట్ లో మరణించిన విషయం గురించి వివరాలు అడిగారు. అప్పటికే శాస్త్రీజీ మరణం మీద పత్రికలలో సందేహాలు వెలిబుచ్చటంతో, ప్రభుత్వం ‘అందులో సందేహించడానికి ఏమీ లేదనీ శాస్త్రీజీ మరణం గుండెపోటుతోనే సంభవించిందనీ’ ప్రకటించి ఉంది కూడా!

  అయినా సహ చట్టం క్రింద వివరాలడిగితే... ‘అది రెండు దేశాల మధ్య సంబంధాలను ప్రభావితం చేస్తుంది కాబట్టి, సమాచారం ఇవ్వడం కుదరదు’ పొమ్మంది.

  మరొకరు పిఎంఓ లో జరిగిన ఓ వ్యవహారం గురించి అడిగారు. అప్పుడూ... ‘అది PMO కు సంబంధించిన వివరాలు బయటపెట్టటమౌతుంది కాబట్టి కుదరదు’ పొమ్మంది. ఇలాగే మరికొన్ని విషయాలలో, ఇన్ని లక్షలు చెల్లిస్తే సమాచారం ఇవ్వటం కుదురుతుందని చెప్పటం జరిగింది.

  వేటికి వాటికి ఏదో ఒక కారణం చెబుతూనే ఉంటుంది. ఇంకా ఏమైనా అంటే - చట్టంలో కొన్ని లొసుగులున్నాయంటారు. విషయమేమిటంటే - మనం గ్రుడ్డివాళ్ళు ఏనుగుని తడిమినట్లు, చట్టంలో లొసుగుల గురించి మాట్లాడుకుంటాం. వాళ్ళేమో, ఆ లొసుగుల్ని ఉపయోగించుకుని, పబ్బం గడుపుకుంటూ ఉంటారు. ఈ కంతల గురించి మాట్లాడటమే నేను చేస్తున్నది.

  ఇక అంతగా ప్రాముఖ్యం గాని విషయాలకైతే వాళ్ళు సమాచారం ఇస్తారు. అవే ఘన విజయాలుగా మీడియా ప్రచారం చేస్తుంది.

  ఇకపోతే నా టపాకాయలో చెప్పిన విషయంలో... ఏ వ్యక్తి అయినా, అతడు కట్టవలసిన పన్ను విషయం, అతడి వ్యక్తిగతం అయి ఉండదు. అది ప్రభుత్వానికి కట్టాల్సిన సొమ్ము, ప్రజాధనం! కాబట్టి అది ప్రైవేటు వ్యవహారం కాదు, పబ్లిక్ వ్యవహారం అవుతుంది.

  మరో విషయం ఏమిటంటే - గతంలో ఓ సినిమా నటుడి పన్ను ఎగవేత గురించి, సహచట్టం క్రింద సామాన్యులెవరో అడిగితే, సదరు అధికారులు వివరాలు ఇవ్వలేదని విమర్శిస్తూ, ఇదే మీడియా వ్రాసింది కూడా! మీకు విషయం అర్ధమైందనుకుంటాను.

  అయినా మీ అభిప్రాయం మీరు వ్యాఖ్యగా వ్రాసారు. అందులో క్షమాపణల అవసరం లేదనుకుంటాను! :) నెనర్లు!

  రామూ గారు, అజ్ఞాత గారు: నెనర్లండి!

  ReplyDelete