Wednesday, April 22, 2009

సోనియా రామాయణం

[రామరాజ్యంలో విద్వేషాల్లేవ్. అద్వానీ అది తెలుసుకోవాలి – సోనియా, వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! సోనియా గాంధీ రామాయణం ఎప్పుడు చదివిందో మరి! రామరాజ్యంలో విద్వేషాల్లేవ్ అని అద్వానీకి ఉపదేశం చేస్తోంది. రామరాజ్యం సంగతి తరువాత, ఆవిడ విద్వేషాల మాటేమిటి? తన అవినీతిని ప్రశ్నించిన సీనియర్లు, మార్గరేట్ ఆల్వా లాంటి వారిని పంపించేసింది, పీ.వి.నరసింహారావు వంటి వారిని మరణానంతరం కూడా అగౌరవపరిచింది కదా!

సుబ్బారావు:
పిచ్చిమరదలా! దీనికే ఆశ్చర్యపోతున్నావు. ఈ మధ్య సోనియా, ఆమె సంతానం భారత పురాణగ్రంధాల గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు తెలుసా? మొన్న ప్రియాంక వాద్రా, తన తమ్ముడు వరుణ్ గాంధీకి భగవద్గీత చదవమని సలహా ఇచ్చింది. నిన్న సోనియా గాంధీ [తన అన్నలాంటి] అద్వానీకి రామాయణం తెలుసుకోమని ఉపదేశం ఇచ్చింది. ఇదో కొత్త ప్రక్రియ మరి!

సుబ్బలష్షిమి:
బహుశః భారతంలో కురుక్షేత్రం అనంతర పరిణామాల్లో స్వర్గారోహణ పర్వం ఉన్నట్లు, తమందరకీ ఈ ఎన్నికల రణక్షేత్రం అనంతర పరిణామాల్లో నరకావరోహణ పర్వం ఉంటుందని భయమేస్తోందేమో!

*************

4 comments:

  1. Well said. They can use any means to rule India for ever.

    ReplyDelete
  2. బైబిలు, ఖురాన్ ఎలాగూ మాకే ఇక రామాయణాన్ని కూడా ఓ పట్టుపడితే ఇక మాకెదురేలేదు, ఇక అంతా లౌక్య, లౌకిక రాజ్యమే

    ReplyDelete
  3. చిలమకూరు విజయమోహన్ గారు,
    నిజమే సుమా!

    ReplyDelete