Wednesday, April 29, 2009

నిరాహార దీక్షలు ఇలా కూడా చేయవచ్చన్న మాట !

[తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి హైటెక్ ఆమరణనిరాహార దీక్ష వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! తమిళనాడు సి.ఎం. కరుణానిధి మొన్న హఠాత్తుగా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టాడట. లంకలో యుద్ధం కారణంగా తమిళులు నలిగిపోతున్నారని, అంచేత సైన్యం యుద్ధం ఆపాలని డిమాండ్ చేస్తూ దీక్షబూనాడట. సింగిల్ కాట్, మెత్తటి పరుపు, రెండు కూలర్లు గట్రా పెట్టుకుని మరీ నిరశన వ్రతం చేపట్టాడు. బహుశః స్వాతంత్ర సమరం రోజుల్లో ఎవరూ ఊహించి ఉండరు కదూ భవిష్యత్తులో నిరశన వ్రతాలు, నిరాహార దీక్షలూ కూడా ఇంత లగ్జరీగా చేయవచ్చని!

సుబ్బారావు:
అవును మరదలా! ‘పోనీలే పాపం, కరుణానిధి వయస్సు పైబడ్డవాడు’ అని సరిపెట్టుకుందామన్నా, ఆనాడు బ్రిటిషు వాళ్ళకి వ్యతిరేకంగా అంతకంటే వయోవృద్దులు కూడా నిరాహార దీక్షల్లోనూ, హర్తాళ్ ల్లోనూ పాల్గొన్నారు మరి!
***********

5 comments:

  1. పగటి పూట నిరాహార దీక్షలు చేస్తూ రాత్రి పూట భోజనం చేసేవాళ్ళ గురించి నేను చిన్నప్పుడు విన్నాను. హిట్లర్ కంటే పచ్చిగా అబద్దాలు ఆడే టాలెంట్ ఉన్న మన రాజకీయ నాయకులకి ఈ రకం నాటకాలు ఆడడం విచిత్రం అనిపించదు.

    ReplyDelete
  2. కరుణానిధి is one of the most dangerous man India ever seen. He hates his own country & culture to get the votes of minorities. He can do anything to capture power.

    ReplyDelete
  3. కరుణానిధి ఇబ్బంది పడితే యావత్ ప్రపంచ తమిళులు ఇబ్బంది పడరా మరి ! అసలే వైశాఖం ఎండలు అందులోనూ అది చెన్నై ఉక్కపోతతో తమిళులందరూ ఇబ్బందిపడరూ.మీరు మరీనూ అన్నిటికీ విమర్శలేనా ?

    ReplyDelete
  4. కరుణానిధికి మద్దతు తెలుపుతూ ఈ రోజు తెల్లవారి కాఫీ తాగి, డోనట్ తిని, మధ్యాహ్నం చికెన్ తిన్న తర్వాత 3 గంటలపాటు నిరాహారదీక్ష చేసాను.

    ReplyDelete
  5. @చిలమకూరు విజయమోహన్ గారు,
    అవునండీ! మేము చాలా మరీఈఈఈఈ
    ****

    @జీడిపప్పుగారు,
    మేమూ మీకు మద్దతిస్తాం.

    ReplyDelete