Monday, April 20, 2009

జూ. ఎన్టీయార్ Vs లోక్ సత్తా జె.పి. – ఈనాడు ప్రాధాన్యత ఎవరికి?

[నేడు టీవీల్లో జూనియర్ ఎన్టీ ఆర్ మలి విడత ప్రచారం, వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఎలక్ర్టానిక్ మీడియా, పేపర్ మీడియా ముఖ్యంగా ఈనాడు ఈ జూనియర్ ఎన్టీ ఆర్ కి ఇచ్చిన ప్రచారంలో పదోవంతు కూడా లోక్ సత్తా అభ్యర్ధులకీ గాని, జయప్రకాష్ నారాయణకు గాని ఇవ్వలేదు చూసావా? వయస్సులోనూ, అనుభవంలోనూ, మేధస్సుల్లోనూ, వాగ్ధాటిలోనూ వేటిల్లోనూ జే.పి., జూనియర్ ఎన్టీ ఆర్ తో సరితూగ లేక పోయాడా?

సుబ్బారావు:
భలే దానివే మరదలా! ఈనాడు రామోజీరావుకి అవినీతి, అనైతికత లోంచి వచ్చిన వాళ్ళ మీద ఉన్నంత ప్రేమ, నిరంతరం నీతి, నిజాయితీలతో, ప్రజలను చైతన్యపరుస్తూ మాట్లాడే వాళ్ళ మీద ఉంటుందా? నువ్వెంత అమాయకురాలివి?

***************

6 comments:

  1. అమ్మా, అదెలాగండి. జేపీ కి importance ఇస్తే, ఆయన మాటలకు సమాధానమూ చెప్పలేరు, ఆయన్ను కాదనీ అనలేరు. పైగా మన పత్రికకూ ఒరిగేదేం లేదు.

    ReplyDelete
  2. >>>ఎలక్ర్టానిక్ మీడియా, పేపర్ మీడియా ముఖ్యంగా ఈనాడు ఈ జూనియర్ ఎన్టీ ఆర్ కి ఇచ్చిన ప్రచారంలో పదోవంతు కూడా లోక్ సత్తా అభ్యర్ధులకీ గాని, జయప్రకాష్ నారాయణకు గాని ఇవ్వలేదు చూసావా?

    ఎప్పుడూ ప్రజల పక్షం అనే ఈనాడు ఈ విషయంలో తన డొల్లతనాన్ని బహిర్గతం చేసిమరీ చూపించింది.

    ఇప్పుడున్న ఎలక్ట్రానిక్ మీడియా గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.

    ReplyDelete
  3. i wont agree with u.............nijamga anta focus chste j.p loni minus lu kooda andariki telisevi.........

    ReplyDelete
  4. వినయ్ గారు,
    ఆయన బలహీనతలు తెలుసుకోవడం కూడా మంచిదే కదా. ఫోకస్ చేయనివ్వండి. ఎందుకు చెయ్యరు?

    ReplyDelete
  5. రవి గారు,
    వినయ్ గారు,

    నేను అదే చెప్పాలనుకున్నాను. రవి గారు చెప్పినందుకు కృతఙ్ఞతలు.

    ReplyDelete
  6. ఏవైనా మైనస్సులుంటే..... అంతకన్నా పెద్ద న్యూసు ఉండదు కదా??

    ReplyDelete