[నిన్న తిట్టుకుని, ఈరోజు భాయీ భాయీ అంటున్న ప్రణబ్, లాలూ వార్త నేపధ్యంలో]
సుబ్బలష్షిమి:
బావా! మంగళవారం బీహార్ ఎన్నికల ప్రచార పర్యటనలో ప్రణబ్ ముఖర్జీ, లాలూ మీద తీవ్రపదజాలంతో విరుచుకుపడ్డాడట. ఈసారి మంత్రి అయ్యేదీ అనుమానమే అన్నాడట. దానికి లాలూ కూడా తీవ్రంగా స్పందించాడట. మంగళవారం రాత్రి మళ్ళీ ఇద్దరూ ఫోన్ లో మాట్లాడుకుని ఒకటైపోయారట. లాలూపై వచ్చీరాని హిందీలో తాను చేసిన వ్యాఖ్యలు గందరగోళానికి కారణమయ్యాయని ప్రణబ్ బుధవారం విలేఖరులకి చెప్పారట.
సుబ్బారావు:
ప్రతీసారి తమ మాటలని మీడియా వక్రీకరించింది అంటే వినేవాళ్ళకి బోరు కొడుతుందని, పాపం ఈసారి నింద తన హిందీ పరిఙ్ఞానం మీద వేసుకున్నారన్నమాట. అంతేమరదలా! రాజకీయ నాయకుల నాలుకలు మహా నాజూకైనవి, ఎన్ని ఒంపులైనా తిరగ్గలవు.
Sunday, April 26, 2009
Subscribe to:
Post Comments (Atom)
అంతగా తిట్టుకుని ఒక ఫోనుతో వాళ్ళెలా కలిసిపోయారో చూసారా! మన తెలుగు బ్లాగులోకంలో అలా ఒక్క టపాతో అంతా కలిసిపోకూడదా !
ReplyDeleteఅవును, బాగా చెప్పారు సార్!
ReplyDelete