[విదేశీ అకౌంట్లలో నల్లధనం – భారత రాజకీయ పార్టీలకు ఇది ఎన్నికల మేతగా దొరికింది. వారు చెబుతున్న మొత్తాలు విశ్వగించేట్లు లేవు – స్విస్ బ్యాంకర్ల అసోసియేషన్ వ్యాఖ్య నేపధ్యంలో ]
సుబ్బలష్షిమి:
ఈవార్త చూశావా బావా! ఎన్.డి.టివీ లో వ్యాఖ్యానిస్తూ స్విస్ బ్యాంకర్ల అసోసియేషన్ ప్రతినిధి నాసర్, ‘లక్షల కోట్ల నల్లధనం స్విస్ బ్యాంకుల్లో లేదనీ, అంత భారీ మొత్తాల గురించి మాట్లాడుతూ భారత రాజకీయ పార్టీలు ఎన్నికలలో లబ్ధి పొంద ప్రయత్నిస్తున్నాయనీ’ అన్నాడట. కొన్నిరోజుల క్రిందట ఈ ఆసోసియేషన్ వాళ్ళే స్విస్ లో నల్లధనం దాచిన దేశాల్లో భారతదేశమే మొదటి ర్యాంకులో ఉందనీ అన్నారంటూ పత్రికలు ప్రకటించాయి. ఇప్పుడీ వార్త! ఇంతకీ ఏం జరిగి ఉంటుంది బావా?
సుబ్బారావు:
ఏమైన జరగవచ్చు మరదలా! ఈ స్విస్ బ్యాంకర్ల అసోసియేషన్ మాట మార్చి ఉండొచ్చు. లేదా పత్రికలు రంగు మార్చి ఉండవచ్చు. లేదా కాంగ్రెస్ పార్టీగానీ, ఇతర పార్టీలు గానీ, మొత్తంగా డబ్బుదాచుకున్న బడాబాబులు గానీ, లాబీయింగ్ చేసి, బ్యాంకర్ల అసోసియేషన్ తమకు అనుకూల ప్రకటన చేసేలా ప్రభావపరిచి ఉండొచ్చు!
***********
Tuesday, April 28, 2009
Subscribe to:
Post Comments (Atom)
Good Satirical system u created. Congrats. subba rao javaabulo inka koddiga PADUNU kosam try ceyyandi. Diwali kaadu hydrogen bombulaaga pelutundi.
ReplyDeleteSridhar
శ్రీధర్ గారు,
ReplyDeleteసలహాకి కృతఙ్ఞతలు. పదును పెంచటానికి ప్రయత్నిస్తాను.
అయినా స్విస్ బ్యాంక్ వాళ్ళు నిజం చెప్పి వాళ్ళ వ్యాపారం పోగొట్టుకుంటారా !
ReplyDeleteనిజమే సుమా!
ReplyDelete