Friday, November 27, 2009

భర్త చనిపోయినప్పుడు, ఆ బాధ మరిచిపోవాలంటే భార్య రాజకీయాల్లోకి రావాలా?

[“భర్త చనిపోయినప్పుడు ఓ మహిళ బాధ ఎలా ఉంటుందో, ఆ జ్ఞాపకాలు ఎలా వెంటాడుతాయో నాకు తెలుసు, ఎన్నికల్లో పోటీ చేసి ప్రజల్లో తిరిగితే పాత జ్ఞాపకాల నుండి కొంత డైవర్షన్ వస్తుంది. అందువల్ల విజయలక్ష్మినే పోటీలో నిలబెడదాం!” అని సోనియా జగన్ తో అన్నట్లు సమాచారం – ఈనాడు వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! నాకు తెలియక అడుగుతాను, భర్త చనిపోయినప్పుడు ఆ బాధ మరిచి పోవాలంటే భార్య రాజకీయాల్లోకే రావాలా? ఏ సామాజిక సేవో చేస్తే ప్రజల్లో తిరిగినట్లు కాదా? అప్పుడు బాధనుంచి డైవర్షన్ రాదా?

సుబ్బారావు:
సామాజిక సేవచేస్తే, ఆస్తులు కూడబెట్టటం ఎలా కుదురుతుంది మరదలా!

11 comments:

  1. అది మన హిందూదేశపు రాజకీయ సాంప్రదాయము కదండి మరి

    ReplyDelete
  2. బ్యాంక్ ఆఫీసర్ చనిపోతే అతని భార్యకి లేదా కొడుకుకి ఆఫీసర్ ఉద్యోగం ఇవ్వరు, క్లర్క్ ఉద్యోగమే ఇస్తారు. రాజకీయాలలో మాత్రం ఎం.ఎల్.ఎ. చనిపోతే అతని భార్యకి లేదా కొడుకుకి ఎం.ఎల్.ఎ. పదవి ఇస్తారు. ఇంకా నయం, రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యులలో ఒకరికి ముఖ్య మంత్రి పదవి ఇవ్వలేదు.

    ReplyDelete
  3. ప్రవీణ్ శర్మ గారు, అజ్ఞాతల గారు,

    వ్యాఖ్య వ్రాసినందుకు నెనర్లు!

    ReplyDelete
  4. మా నాన్నగారు ఒక పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ ఆఫీసర్ గా పని చేస్తూ చనిపోయారు. మా తమ్ముడికి ఉద్యోగం లేదు, అతనికి బ్యాంక్ వాళ్ళు క్లర్క్ ఉద్యోగం కూడా ఇవ్వలేదు, అతను ప్రైవేట్ ఉద్యోగం చూసుకున్నాడు.

    ReplyDelete
  5. మరి పాతజ్ఞాపకాలనుంచి డైవర్ట్ అవ్వాలంటే కొత్తవ్యాపకాలు కావలిగా. ఆసమాజసేవలు, సంఘసంస్కరణలు వాళ్లింట్లో తరతరాలుగా చేస్తున్నవే. ఇప్పుడు కొత్తగా మొదలెట్టాల్సిన అవసరేముంది. పైగా అవిచేసే ప్రతిసారీ చుక్కల్లోకెళ్ళిన చక్కనోడు గుర్తొచ్చి మళ్లీమళ్లీ బాధపడాలి. అందుకే ఆబాధ తెలిసినామె ఈదారిచూపింది.

    ReplyDelete
  6. ఆదిలక్ష్మి గారూ !
    మీ టపాకాయలు బాగా పేల్తున్నాయి. పెన్ను/ టైపు వాడిని తెలియజేస్తున్నాయి.

    ReplyDelete
  7. టపాకాయలు బాగా పేలుతున్నాయి

    ReplyDelete
  8. చిలమకూరి విజయమోహన్ గారు,

    నెనర్లండి!

    ~~~
    సుబ్రమణ్య చైతన్య గారు,

    అతడి దోపిడికే తట్టుకోలేకపోయాము. ఇక కుటుంబసభ్యులందరి దోపిడి ఎలా తట్టుకోవాలో! పాపం శమించుగాక, ఆమెన్!

    ~~
    SR గారు,

    మీ అభిమానమండి. నెనర్లు!

    ReplyDelete
  9. ఇది కథ కాదు, రియల్ లైఫ్ స్టోరీ. శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం కుమ్మరిగుంట గ్రామంలో పాలవలస సంగం నాయుడు అనే రాజకీయ నాయకుడు ఉండేవాడు. అతను తూర్పుకాపు కులస్తుడు. అతని గ్రామం కొత్తూరు (ST రిజర్వ్డ్) నియోజక వర్గం పరధిలో ఉండడం వల్ల తూర్పుకాపులు ఎక్కువగా ఉన్న ఉణుకూరు నియోజక వర్గం నుంచి పోటీ చేశాడు. అతను చనిపోయిన తరువాత అతని భార్య రుక్మిణమ్మ అదే నియోజక వర్గం నుంచి పోటీ చేసి గెలిచింది. ఆ తరువాత ఆమె కొడుకు రాజశేఖరం అదే నియోజక వర్గం నుంచి పోటీ చేసి గెలిచాడు. కొడుకులకే కాకుండా బంధువులకి కూడా టికెట్లు ఇప్పిస్తుంటారు. మన తెలుగు దేశం నాయకుడు కింజరాపు ఎర్రన్నాయుడు తన చిన్నాన్న కృష్ణమూర్తి పేరు చెప్పుకుని రాజకీయాలలోకి వచ్చాడు. అతను శ్రీకాకుళం జిల్లా హరిశ్చంద్రపురం దగ్గర నిమ్మాడ గ్రామానికి సర్పంచ్ గా ఉండేవాడు. ఎర్రన్నాయుడు MLA అయ్యి సర్పంచ్ పదవికి రాజీనామా చేసిన తరువాత అతని తమ్ముడు అచ్చెన్నాయుడు సర్పంచ్ అయ్యాడు. ఎర్రన్నాయుడు MP అయ్యి MLA పదవికి రాజీనామా చేసిన తరువాత అతని తమ్ముడు MLA అయ్యాడు. మనది ప్రజాస్వామిక రాచరికం అన్న మాట. మన దేశంలో కుటుంబ సభ్యులూ, బంధువులూ పదవులు పంచుకుంటారు.

    ReplyDelete