Monday, November 30, 2009

అమ్మ చెప్పింది అమ్మకిమ్మని .....

[పులివెందుల అసెంబ్లీ టిక్కెట్ ని ‘అమ్మ విజయలక్ష్మి’కిమ్మని ‘సోనియమ్మ’ చెప్పిందన్న జగన్ వార్తల నేపధ్యంలో, రేపు YS విజయలక్ష్మి నామినేషన్ వేయనున్న సందర్భంగా]

సుబ్బలష్షిమి:
బావా! ఈ వార్త చూశావా! అమ్మ చెప్పింది అమ్మకిమ్మని అంటున్నాడు జగన్. పులివెందుల అసెంబ్లీ టిక్కెట్ తన తల్లికివ్వాలని అధిష్టానం చెప్పిందట, తను శిరసావహిస్తున్నారట. ఎంతలో ఎంత మార్పు? ఎంత విధేయత బావా?
మరి సీ.ఎం. సీటు రోశయ్యకివ్వమని ఈ అమ్మే కదా చెప్పింది? అప్పుడంతా “సీ.ఎం. సీటు నాదే” “సీ.ఎం. సీటు” నాదే అని నానా మారాం చేశాడేం బావా?

సుబ్బారావు:
అందుకే గదా ఈ అమ్మ, ఆ బ్యాడ్ బాయ్ ని గనుల్లో పడేసి నలగేసి కూర్చో బెట్టింది? దెబ్బతో విధేయత రాక ఛస్తుందా?

సుబ్బలష్షిమి:
నిజమే బావా! అందుకే కాబోలు ’అమ్మ పెట్టే ఆ నాలుగూ పెడితేనే!’ అంటారు పెద్దలు!

2 comments:

  1. ఏంటో పాపం ప్రార్ధన తప్ప మరో లోకం తెలీని తల్లి ,ఇక ఇప్పుడు రాజకీయ కీచడ్ లో పడితే ఎన్నెన్ని పాప ప్రక్షాణనలు పొందాలో.......
    ఒకప్పుడు ఎదురొస్తేనే పనికిరాదనేవారు ఇప్పుడు ఎన్నుకోడానికి ఇదో అర్హత అయిపోయింది . అందుకైనా మహిళలుగా మన ప్రగతికి సంతోషిద్దాం

    ReplyDelete
  2. చిలమకూరి విజయ మోహన్ గారు,

    నెనర్లు!

    ~~~~
    లలిత గారు,

    అవును సుమా! నెనర్లు!

    ReplyDelete