Wednesday, December 2, 2009

బుష్ గుట్టు పెరుమాళ్ళకెరుక

[2001 లోనే లాడెన్ స్థావరాన్ని అమెరికా సైన్యం చుట్టుముట్టిందనీ, కావాలనే సైన్యం వెనక్కి వచ్చేయగా, లాడెన్, అతడి మందిమార్బలంతో పాకిస్తాన్ కు చేరుకున్నాడని అమెరికా అంతర్జాతీయ వ్యవహారాలు చూసే సెనెట్ కమిటీ నివేదిక వచ్చిందన్న – వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
ఈ వార్త చూశావా బావా! 2001 సెప్టెంబరు లో WTC కూల్చిన తర్వాత మూడు నెలలకే, అమెరికా సైన్యాలు తోరాబోరా గుహల్లోని లాడెన్ స్థావరాన్ని చుట్టుముట్టాయట. అయినా గానీ ఎందుకో వెనక్కి వచ్చేసి, లాడెన్ సురక్షితంగా పాక్ చేరుకునే వెసులుబాటు ఇచ్చారట. ఇదేమి వింత బావా!

సుబ్బారావు:
అంతే మరదలా! అప్పుడే లాడెన్ ను పట్టేసుకుంటే యుద్ధం ఎలా కొనసాగించేటట్లు? యుద్ధం కొనసాగించక పోతే ఆయుధ కంపెనీలకి, పెట్రో దేశాలకీ వ్యాపారాలు ఎలా వృద్ధి అవుతాయి? అంతేగాక అప్పటి అమెరికా అధ్యక్షుడు బుష్ మాత్రం ఏం చేస్తాడనీ, పై నుండి వచ్చిన ఆదేశాలు శిరసావహించక?

సుబ్బలష్షిమి:
అంతేలే బావా! ‘లోగుట్టు పెరుమాళ్ళకెరుక ’ అన్నట్లు బుష్ కి ఇంకెవరు బాసో ఎవరికి తెలుసు?

2 comments:

  1. I hope you aren't suggesting that Ramoji Rao is GW Bush's Boss!!

    ReplyDelete
  2. కుమార్ గారు,

    GW బుష్ తన దేశ ప్రయోజనాలని తృణీకరించి, లాడెన్ విషయంలో వెనక్కి తీసుకున్నాడంటే ఎవరో ఒకరు ఆదేశిస్తేనే కదా! ఆ 'ఎవరో'నే అతడి బాస్ అని అన్నాను. ఇక ఆ బాస్ రామోజీరావా, మరొకరా అన్నది కాలం నిరూపిస్తుంది. వేచిచూద్దాం!

    ReplyDelete