Friday, December 11, 2009

తాంబులాలు ఇచ్చాను, తన్నుకు చావండి....

[రాజకీయ కల్లోలం - 48గంటల్లో తెలంగాణా వాదులు, సమైక్యాంధ్ర వాదులు రోడ్లకెక్కి కొట్టుకునే స్థితి దాకా ఉద్యమాలు రేగటం, బంద్ లూ, యూనివర్సిటీ విద్యార్ధుల ఊరేగింపుల నేపధ్యంలో...]

సుబ్బలష్షిమి:
బావా! పదిహేనురోజుల క్రితం వరకూ కూడా ప్రశాంతంగా ఉన్న రాష్ట్రం... ’ఢిల్లీని గెలిచిన బక్కమనిషి’ దీక్షా దక్షతలతోనూ, అచ్చం ఇంగ్లాండు వాడిలాగే అర్ధరాత్రి నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ అధిష్టానం.... తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు తీర్మానం ఆమోదించమన్న ప్రకటన చేయటంతో, నిప్పుల గుండమై పోయింది. ఏమిటిది బావా?

సుబ్బారావు:
ఏముంది మరదలా! ఇంగ్లాండు వాడిపాలన అయినా, ఇటలీ వ్యక్తి పాలన అయినా, పైపైన ప్యాకింగు మారిందే గానీ లోపలి సరుకు అదే కదా! విభజించి పాలించమన్న కణిక నీతే మరోసారి ప్రయోగింపబడుతోంది.

సుబ్బలష్షిమి:
నిజమే బావా! అఖండ భారతం, ఇండియా పాకిస్తాన్ లుగా విడిపోయినప్పుడు జరిగిన మతఘర్షణలకి, ప్రాతిపదిక ఆర్ధిక కారణాలే అన్నది, చరిత్రకారులు, వాళ్ళ పుస్తకాలు కప్పిపుచ్చినా, పునరావృతం అవుతున్న పరిస్థితులు అదే తెలియచెపుతున్నాయి బావా!

సుబ్బారావు:
దీన్నే మరదలా, ’తాంబులాలు ఇచ్చాను, తన్నుకు చావండి’ అన్నాడు మన అగ్నిహోత్రావధానులు!

5 comments:

  1. సమైక్యాంధ్ర లేదూ, పిండాకూడూ లేదు. ఉదయం శ్రీకాకుళంలో కాంగ్రెస్, తెలుగు దేశం, ABVP గూండాలు రాయలసీమ స్టైల్ లో దొమ్మీలు చేశారు. బ్యాంక్ లు, హాస్పిటళ్ళపై కూడా దాడులు చేశారు. కాంగ్రెస్, ABVP గూండాలు దారిలో నన్ను కూడా కొట్టబోయారు. వీళ్ళకి తమ ప్రాంతంవాళ్ళ మీద కూడా ప్రేమ లేదు కానీ ప్రత్యేక తెలంగాణా వస్తే నష్టమట!

    ReplyDelete
  2. annitiki vallani lagadam em baaledu ...nenu ndhrite ni..but i support telangana :)

    ReplyDelete
  3. ప్రత్యేక తెలంగాణా వస్తే మాకు వచ్చే నష్టం ఏమీ లేదు. మేము హైదరాబాద్ కి దూరంగా ఒరిస్సా బోర్డర్ లో ఉన్న శ్రీకాకుళం జిల్లాలో వ్యాపారాలు చేసుకుంటూ బతుకుతున్నాం. మా వ్యాపారాలు మేము చేసుకుంటుంటే సమైక్యవాదం అంటూ తెలంగాణా వాళ్ళకి వ్యతిరేకంగా ద్వేషం ఒంటపట్టించుకోండి అని కోరుతారేం? ఇందాక ఒక వ్యాపారితో మాట్లాడాను. తెలంగాణా వస్తే తనకేమీ నష్టం లేదనీ, మన ప్రాంతంలో కాకుండా హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టడం రాజకీయ నాయకుల తప్పనీ అంటున్నాడు. మిడిల్ క్లాస్ వ్యాపారులందరికీ వ్యాపారాలు చేసుకోవాలని ఉంది. రాజకీయ నాయకులు మాత్రం తమ స్వార్థ ప్రయోజనాల కోసం దుకాణాలు బంద్ చెయ్యిస్తున్నారు.

    ReplyDelete
  4. cartheek గారు,

    వ్యాఖ్య వ్రాసినందుకు నెనర్లు!
    ~~~~~

    ReplyDelete