Wednesday, December 30, 2009

భూమి గుండ్రంగా ఉంది అని ఇలాక్కూడా నిరూపించబడింది

[సోనియాగాంధీని విదేశీ అని కొందరు వ్యాఖ్యానించటం తొందరపాటు తప్ప మరొకటి కాదు. కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకులు ఏ ఓ హ్యూమ్ కూడా భారతీయుడు కాదని గుర్తుంచుకోవాలి - రోశయ్య వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఈ వార్త చూశావా? కాంగ్రెస్ ని స్థాపించింది విదేశీయులేననీ, అందుచేత ప్రస్తుత అధ్యక్షురాలిని విదేశీ అనకూడదని సెలవిచ్చాడు ఈ గుమాస్తా ముఖ్యమంత్రి!

సుబ్బారావు:
నిజమే మరదలా! కాంగ్రెస్ పార్టీ విదేశీయులచే స్థాపించబడి, స్వదేశీయుల చేత దేశభక్తుల చేత నడపబడి, మళ్ళీ విదేశీల చేతికే వెళ్ళింది. అంతే!

సుబ్బలష్షిమి:
అంటే భూమి గుండ్రంగా ఉంది అని ఇలాక్కూడా నిరూపించబడిందన్న మాట!

6 comments:

  1. తలతిక్క వాదనకి రోశయ్య గారు పెట్టింది పేరు , ఇందులొ విచిత్రమేముంది లెండి!

    ReplyDelete
  2. videsuyula rajyam ga follow avutunam kada videsi paripalana loki veldama malli .A.O hyum nunchi siddantalanu manavall tesukunnaru ante kani atani chetilo mana desanni pettaledu kadaa

    ReplyDelete
  3. కాంగ్రెస్ పార్టీ విదేశీయులచే స్థాపించబడి, స్వదేశీయుల చేత దేశభక్తుల చేత నడపబడి, *విదేశీభక్తుల చేత నింపబడి* ఆపై విదేశీల చేతికెళ్ళింది.

    ReplyDelete
  4. అవునండీ

    భూమి ఎలా వున్నా ఇలానేఉండాలనే వారి చేతిలోనే ఉంటుంది .

    ReplyDelete
  5. లలిత గారు,

    రోశయ్య గారి గురించి మీరు చెప్పింది నిజమేనండి!నెనర్లు!
    ~~~~~
    pasi గారు, చందు గారు, దుర్గేశ్వర గారు,

    నెనర్లండి!
    ~~~~
    సుబ్రమణ్యం చైతన్య గారు,
    మీరు చెప్పిన ’విదేశీ భక్తుల చేత నింపబడి’ అన్న పాయింట్ కూడా వ్రాయవలసిన విషయమేనండి! నెనర్లు!

    ReplyDelete