Monday, December 7, 2009

తెలంగాణా జిల్లాలకే కాదు దేశమంతటా సెలవులు ఇవ్వాల్సిందే!

[తెలంగాణా జిల్లాలలోని కళాశాలలకి మాత్రమే సెలవులు ప్రకటించటంతో EAMCET, AIEEE వంటి ఉమ్మడి ప్రవేశపరీక్షలకు సిద్దంకావటంలో ఆంధ్రా, రాయల సీమలలోని విద్యార్ధులతో తెలంగాణా విద్యార్ధులు సరిగా పోటీ పడలేరనీ, అందుచేత ఆంధ్రా, రాయలసీమ జిల్లాలలోని కళాశాలకు కూడా ప్రభుత్వం సెలవులు ప్రకటించాలని తెలంగాణా ప్రైవేట్ కళాశాలల యాజమాన్య సంఘ ఆధ్యక్షుడు శశిధర రెడ్డి (త్రివేణి కళాశాల డైరక్టరు, సూర్యాపేట) డిమాండ్ చేశాడు - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
ఈ వార్త చూశావా బావా! EAMCET, AIEEE లకి సిద్దం కావడంలో విద్యార్ధులలో వ్యత్యాసాలొస్తాయట. అందుచేత తెలంగాణా జిల్లాలతో పాటు మొత్తం రాష్ట్రంలోని కళాశాలన్నిటికీ సెలవులు ప్రకటించాలని డిమాండు చేస్తున్నారు తెలంగాణా ప్రైవేటు కళాశాలల యజమానులు.

సుబ్బారావు:
అయ్యో! వాళ్ళింకా బాగా ఆలోచించాల్సింది మరదలా! ఎంసెట్ మన రాష్ట్రానికి మాత్రమే వర్తిస్తుంది. మరి AIEEE, IIT వంటి ఉమ్మడి ప్రవేశ పరీక్షల మాటేమిటి? అందుచేత, పనిలో పనిగా తెలంగాణా జిల్లాలతో పాటు, మొత్తం దేశమంతటా, అన్ని కళాశాలలకీ సెలవులు ప్రకటించాలని డిమాండ్ చేస్తే బాగుండేదే!

సుబ్బలష్షిమి:
నిజమే బావా! పాపం! వాళ్ళకింకా అంత బుర్ర వెలిగినట్లు లేదు!

6 comments:

 1. In Inter every single day is very Importent.....The govt taken a stupid desission by giving the holidays....the impact will be on Telangana students.they are loosing the valueble days......

  ReplyDelete
 2. సుబ్బారావు: ఇంకో సంగతి మరదలా ?

  సుబ్బలష్మి : ఏంటి బావా

  సుబ్బారావు : ధగ ధగ వెలిగి పోతున్న మన ప్రబుత్వ పెద్దల బుర్రల గురించి కూడా కూసింత సేప్పుకోవాలి మనం.

  సుబ్బలష్మి: నా మట్టి బుర్రకి అర్ధం కాట్లేదు అదేదో నువ్వే ఇవరంగా చెప్పు బావా

  సుబ్బారావు : తెలంగాణా ఇస్తానని సెప్పి తెలంగాణా ఓట్లను దండుకుని తెలుగుదేశాన్ని ఓడించి తిరిగి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ... ఆరేళ్లుగా ఆ మాట నిలబెట్టుకోక పోగా ఎదవ నాటకాలాడటం అన్యాయం గందా. ఇచ్చిన మాట నిలబెట్టుకున్తావా లేదా అని తెలంగాణా పిల్లకాయలు అడిగినంత మాత్రాన వాళ్ళ సదువులు నాశానమైపోఎలాగా స్వయానా ప్రబుత్వమే కాలేజీలకు సెలవులు ప్రకటించడం.....చిప్ప పోలీసుల్ని యూనివర్సిటీ హాస్టళ్ళ లోపలి పంపి మరీ పిల్లకాయల బుర్రలు బద్దలు కొట్టేయించడం గోరం కాదా? ఎతంతావు?

  సుబ్బలష్మి : నిజమే బావా. మనం మన పిలకాయల గురించే ఆలోచిస్తున్నాం గాని ఎక్కడైనా పిలకాయలు పిలకాయలె కదా పాపం.

  ReplyDelete
 3. అంతేకాదు.... తెలంగాణాలో బందులవల్ల సాఫ్ట్వేర్ కంపెనీలుకూడా "స్వచ్చంద" బందులు పాటిస్తే అక్కడివారు సేవారంగంలోకూడా వెనుకబాటుకుగురౌతారు (ఒక వేళ దేశమంతటాకూడా సాఫ్ట్వేర్ కంపెనీలి మూసివెయ్యకపోతే). ఇలా ఎవరైనా ఆలోచిస్తేబాగుండు.

  ReplyDelete
 4. Kevvu..... If we wanna go for world class B schools there would be even variations...hence there should be holidays for the entire world...

  ReplyDelete
 5. విదేశీ విద్య కోసం వెళ్ళే విద్యార్థులతో పోటీ పడాలంటే ప్రపంచ వ్యాప్తం గా సెలవులు ప్రకటించాలి.....హ హ హా

  ReplyDelete
 6. అజ్ఞాత గారు,

  జై ఆంధ్రా ఉద్యమం అప్పుడు కొన్ని నెలలు పాటు స్కూళ్ళకి సెలవులు ఇచ్చారండి. ఇప్పుడేం జరుగుతుందో చూద్దాం. వ్యాఖ్య వ్రాసినందుకు నెనర్లు!

  ~~~~
  ప్రభాకర్ మందార గారు,

  మంచి టపాకాయ పేల్చారండి. నెనర్లు!

  ~~~~
  Indian Minerva గారు,

  ప్రభుత్వం అలా ఆలోచించినా ఆశ్చర్యం లేదండి!వ్యాఖ్య వ్రాసినందుకు నెనర్లు!

  ~~~~
  అజ్ఞాత గారు,

  తమ మాట నడుస్తుందంటే, అలాంటి డిమాండ్ చేయగలరండి!:)

  ReplyDelete