[పార్లమెంట్ క్యాంటిన్ లో చౌకధరలో భోజనం - వార్త నేపధ్యంలో]
సుబ్బలష్షిమి:
ఇది చదివావా బావా! పార్లమెంట్ క్యాంటిన్ లో పన్నెండు రూపాయలకే పుల్ మీల్స్ ట. చికెన్ బిరియానీ 34/- రూ.లే. చేపల పులుసు 17/- రూపాయలేనట!
సుబ్బారావు:
అందుకేనేమో మరదలా! నిత్యావసర సరుకుల ధరలు చుక్కల్ని దాటి ఎటో వెళ్ళిపోయినా రాజకీయ నాయకులకి పట్టటం లేదు.
సుబ్బలష్షిమి:
దీన్నే ’చద్దన్నం తిన్నమ్మ మగనాకలి ఎరగదు’ అంటారు బావా పెద్దలు!
Monday, December 21, 2009
Subscribe to:
Post Comments (Atom)
భలే భలే. ఇక్కడ అమెరికన్ను కాంగిరెస్సులోనూ ఇదే వరస. ఆరొందల పైచిలుకు బాడఖోవులకీ ప్రజాధనంతో తుమ్మినా దగ్గినా ఐదు నక్షత్రాల ట్రీట్మెంటు. ప్రజలకి హెల్తు కేరు కల్పించేందుకు మాత్రం ఏడిఛ్ఛస్తున్నారు.
ReplyDeleteమంచి సెటైర్. బాగుంది. కోటీశ్వరులైన రాజకీయనాయకులకి అంత తక్కువ ధరలలో దొరుకుతుంటే, సామాన్యులగురించి వాళ్ళకు పడుతుందా?
ReplyDelete