Saturday, December 12, 2009

మింగ మంటే కప్పకి కోపం, విడవమంటే పాముకి కోపం....

[తెలంగాణా కావాలని కొందరూ, సమైక్యాంధ్ర ఉండాలని కొందరూ ఘర్షణలు పడుతున్న నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం కావాలని కొందరూ, సమైక్యాంధ్ర కావాలని మరి కొందరూ ఘర్షణలు పడుతున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినా గొడవే, ఇవ్వకపోయినా గొడవే. కేంద్రం ఏం చేస్తుందంటావూ?

సుబ్బారావు:
ఈ పరిస్థితి కేవలం మన ఆంధ్రప్రదేశ్ కి మాత్రమే పరిమితం కాలేదు మరదలా! దేశమంతా చుట్టుకుంది. అంతేకాదు మన ప్రధాని ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా సమస్యని పరిష్కరిస్తానన్నాడు.

సుబ్బలష్షిమి:
అంటే కప్పకి, పాముకి కూడా మనోభావాలు దెబ్బతినకుండా పరిష్కరిస్తాడా బావా! అయితే చూడాల్సిందే అది ఎలా ఉంటుందో!

1 comment:

  1. మింగమని పాముకి చెప్పాల్సిన పనిలేదు. గమ్ముగా ఉంటేచాలు. రెండూకలిసే ఉండిపోతాయి

    ReplyDelete