Saturday, December 11, 2010

గుమ్మడి కాయల దొంగంటే భుజాలు తడుముకున్నట్లు…

[ఉద్యమాల ముసుగులో మామూళ్ళు – జేపీ,
దమ్ముంటే ఆధారాలు బయటపెట్టు – కేటీఆర్ వార్తల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! లోక్ సత్తా నేత జేపీ
>>>ఉద్యమాలు, పార్టీల ముసుగులో కొందరు బలవంతపు వసూళ్ళు చేస్తున్నారు. హింస, విధ్వంసం, రక్తపాతం, భయంతో ఎవరూ ఫిర్యాదు చేయడం లేదు.
అన్నాడు.

జేపీ ఎవరి పేరుని ఉద్దేశించకపోయినా, ‘గుమ్మడి కాయల దొంగంటే భుజాలు తడుముకున్నట్లు…’ ఆ వ్యాఖ్యలకు స్పందిస్తూ తెరాస నేత కేసీఆర్ తనయుడు కేటీఆర్

>>>ఉద్యమాలు, పార్టీల ముసుగులో బలవంతపు వసూళ్ళు చేస్తున్నారంటూ ఆరోపించిన కుహనా మేధావికి దమ్ముంటే ఆధారాల్ని అసెంభ్లీలో ప్రవేశపట్టాలి. ఎలాంటి ఆధారాల్లేకుండా తెలంగాణాకు వ్యతిరేకంగా అడ్డగోలుగా మాట్లాడటం ఆపకపోతే హైదారాబాదులో తిరిగే పరిస్థితి ఉండదు.
అన్నాడు.

“తెలంగాణాకు వ్యతిరేకంగా మాట్లాడితే హైదరాబాదులో, తెలంగాణా జిల్లాల్లో ఎలా తిరుగుతారో చూస్తాం, నాలుకలు కోస్తాం”,… అంటూ బాహాటంగానే దందాగిరి చేసారు, చేస్తున్నారు కదా? ఇంకేం ఆధారాలు కావాలట? “తెలంగాణాకు వ్యతిరేకంగా మాట్లాడితే ఖబడ్ధార్” అని బెదిరించేవాళ్ళు “చందాలివ్వక పోతే చూస్కోమల్లా?” అనరా?

సుబ్బారావు:
వాళ్ళు తెరాస వాళ్ళు మరదలా!? ఏం అనటానికైనా, ఏం చెయ్యటానికైనా తమకి హక్కుంది అనుకుంటారు. బహుశః దందాగిరి ఆ పార్టీ సంస్కృతి కావచ్చు.

సుబ్బలష్షిమి:
కాదు బావా! ఆ పార్టీ అధినేత కేసీఆర్ కు రజాకర్ల గురువు నిజాం ఆదర్శప్రాయుడట ! అప్పుడు ఆ పార్టీ నుండి ఇలాంటి వ్యాఖ్యలు కాక ఎలాంటి వ్యాఖ్యలొస్తాయి మరి!

6 comments:

  1. ఈయన అంటే వాళ్ళు విద్యార్థుల కేసుల పై ఉద్యమించారా ? లేక వీళ్ళు ఉద్యమించాక ఈయన స్పందించారా ? గుమ్మడి కాయల దొంగ సామెత దీనికెలా వర్తిస్తుంది.

    ReplyDelete
  2. mukku thimmana[kcr]TRS-Partybetti entha lolli jesttundaadu..aah?

    ReplyDelete
  3. THIVIRI ISUKA NUNDI TAILAMMU THEEYYA VOCHCHU
    KUNDETI KOMMU SADHINCHA VOCHCHU,
    MOORKHUNI MANASSU RANJIMPA JAALAMU,
    VISWADABHIRAMA VINURA VEMA.

    ReplyDelete
  4. జేపి సరైన మాటలు సరైనవే....సమయం సరైనదే...కాని సందర్భం సరైంకాదు.....

    నావాదనే సరైందన్న భావన మితిమీరడం వల్ల ఇలా జరుగుతుంది....

    జేపిగారి అమాయకమైన నీతి మాటల వల్ల ...
    సంవత్సరం క్రితమే ఇచ్చిన మాట తప్పుతున్న,
    ఉద్దెశ్యపూర్వకంగా తాత్సారానికి పాల్పడుతున్న,
    వారిని విడుదల చేయడం వల్ల ఉద్యమం ఉదృతి పెరుగుతుందని భయపడుతున్న,
    ఈ చేతకాని సర్కారుకి ...నైతికంగా అనైతికమైన-ఊతాన్ని ఇచ్చినట్లయింది.....

    కొందరి కళ్ళలో కన్నీళ్ళు వస్తుంటే...

    కొందరి కళ్ళ మంట చళ్ళారి నట్లైంది...

    ఈ బోడి వాదనలంతా మాట ఇవ్వముందు చేసిఊంటే బాగున్ను...
    పిల్లికి గంట కట్టటం ఏలా అని అలోచిం చే ఎలుకల చర్చలా ఉంది.

    ReplyDelete
  5. అయ్యా సత్య గారు,
    ప్రతి బలాగులు లో వచ్చి అదే కామెంట్ ఎత్తి పోతల పోస్తున్నారు,

    సంవత్సర క్రితం ఎవరు మాట ఇచ్చింది? ఏమని మాట ఇచ్చింది? బలవంతపు వసూళ్లు, బస్సులను, ఆస్తులను తగలబెట్టే వాళ్ల మీద కేసులు పెట్టము అని ఎవరయినా మాట ఇచ్చారా? మాట ఇచ్చినట్లు మీరే మయినా కల గన్నార? లేక మీ దొర గారు చెప్పారా మీ ఇటలీ నుండి దిగిన తెల్ల తోలు తెలంగాణా దేవత చెప్పింది అని?

    మాట గీట అంటూ ఇస్తే అది తెలంగాణా ఏర్పటు గురించి కాని, తిన్నది అరక్క ఆస్తులు తగలెట్టే వాళ్లమీద కేసులు ఎత్తివేసి, మళ్లీ తగలెట్టమని క్లీన్ చీటీ ఇవ్వటం కోసం కాదు కదా వాళ్లు ఏ ప్రాంతం వారు అయినా!!? తెలబానులు ఏమయినా అడగాలనుకొంటే, దాని గురించి అడగాలి కాని, తప్పుడు పనులు చేసే వాళ్ల మీద కేసులు ఎత్తేయవద్దు అని అన్న వాళ్ల మీద ఊళ్లొ తిరగనీయమని భుజాలు తడుముకొంటూ గొడవ పెట్టే దొర గారు వాళ్ల భజన పరుల గురించి ఎందుకండీ మీ బాధ!!

    అయినా మీ దొర గారికి కాల్మొక్కి, ఆయన కుటుంబం చెప్పినట్లు కాంగీని బలపరచటం లో బిజీ గా ఉండక, కేసుల గురించి ఎందుకు?

    ReplyDelete
  6. వ్యాఖ్యలు చేసిన అందరికి నెనర్లు!

    ReplyDelete