Friday, January 1, 2010

అప్పుడెన్ని బుగ్గకార్లో!

[జార్ఖండ్ లో శిబూసోరెన్ ముఖ్యమంత్రి, మరిద్దరు ఉపముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! చిన్నరాష్ట్రం జార్ఖండ్ లో ఒక ముఖ్యమంత్రి, ఇద్దరు ఉపముఖ్యమంత్రులట తెలుసా?

సుబ్బారావు:
మరదే మరదలా! ఇప్పుడు మన రాష్ట్రాన్ని కూడా... ఆంధ్రా, గ్రేటర్ సీమ, తెలంగాణా, హైదరాబాద్ అంటూ నాలుగో అయిదో ముక్కలుగా కాకుండా ఏకంగా ఒక్కో జిల్లాని ఒక్కో రాష్ట్రంగా చేసేస్తే సరి! ఒకో రాష్ట్రానికి ఒక్కో ముఖ్యమంత్రి! ఇద్దరో ముగ్గురో, కుదిరితే నలుగురో ఉపముఖ్యమంత్రులు! ఇక చూస్కో నాసామి రంగా! మొత్తం తెలుగుగడ్డపైన ఓ పాతికమంది ముఖ్యమంత్రులూ, ఓ వందమంది ఉపముఖ్యమంత్రులూ ఉంటారు.

సుబ్బలష్షిమి:
అప్పుడెంచక్కా ఎటు పోయినా బుగ్గకార్లే కదా బావా!

1 comment:

  1. బాగుంది. బుగ్గకార్ల నిండా పందికొక్కులే. గులాబీయికొన్ని, పచ్చయి కొన్ని, తెల్లయికొన్ని.

    ReplyDelete