Wednesday, January 20, 2010

ఇంత చిన్న వయస్సులో అంత పెద్ద బాధ్యతా?

సెన్సారు బోర్డు సభ్యుడిగా శిరీష్ భరద్వాజ్ నియామకం - వార్త నేపధ్యంలో

సుబ్బలష్షిమి:
బావా! శిరీష్ భరద్వాజ్ ను సెన్సారు బోర్డు సభ్యుడిగా నియమించారట. ఈ శిరీష్ భరద్వాజ్ చిరంజీవి రెండో అల్లుడేనా బావా?

సుబ్బారావు:
ఎవరికి తెలుసు మరదలా! వార్త వ్రాసిన పత్రిక వారు చెబితేనే గదా సామాన్యులకి తెలిసేది?

సుబ్బలష్షిమి:
అతడే అయితే... నిండా పాతికేళ్ళు కూడా లేని వాడికి సెన్సారు సభ్యత్వమా బావా?

సుబ్బారావు:
ఎవరితో ఎవరికి ఏ అవసరం వచ్చిందో మరదలా? అప్పుడే కదా నేరుగా పదవొచ్చి ఒడిలో వాలేది?

2 comments:

  1. శిరీష్ లక్కీ ఫెలో. సెన్సార్ చేయబడిన దృశ్యాలన్నీ చూసుకోవచ్చు.(సరదాగా). వాని అర్హతలేమిటో? ఇంత దారుణమా? ప్రభుత్వం అతన్ని నియమించడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. చిరు! ఏమిటీ విపరీతం. నీ అల్లుడు మేధావా? ఎట్లా ఇస్తారయ్యా అతనికి ఈ ఉద్యోగం.?

    ReplyDelete
  2. అర్హతల్లా ఫలానావాడి అల్లుడు కావడమే!!
    దేశం రాజకీయ నాయకుల సొంతసొత్తు మరి!

    ReplyDelete