[టీవీ వాణిజ్య ప్రకటనల్లో, పత్రికల మహిళా శీర్షికల్లో అమ్మలందరూ పాంట్లూ, షర్టులూ వేస్తున్న నేపధ్యంలో]
సుబ్బలష్షిమి:
బావా! ఈ మధ్య టీవీల్లో ఎక్కువగా, ఏ వాణిజ్య ప్రకటనలో చూసినా, పత్రికలలో మహిళా శీర్షికలలో చూసినా అమ్మలెవరూ చీరలూ, చుడీదార్లూ ధరించి కనబడటం లేదు. పాంట్లూ, షర్టులూ లేదా మిడ్డీలు వేసుకున్న ఫోటోలే ఉంటున్నాయి. చివరికి ’పార్టీవేర్’ లంటూ పత్రికల్లో పరిచయం చేసే దుస్తులు కూడా మోకాళ్ళ పైకి ఉండీ, చేతుల్లేని గౌనులే ఉంటున్నాయి. ఇంకా చెప్పాలంటే స్నానాల గది నుండి తువ్వాలో, లంగానో చుట్టుకొచ్చినట్లున్న డ్రస్సులు ప్రదర్శిస్తున్నారు. ఇవేం వింత పోకడలు బావా!
సుబ్బారావు:
వింతేమీ లేదు మరదలా! కార్పోరేట్ దిగ్గజాలు, మీడియా మదగజాలూ - అందరూ కలిసి భారతీయ సంస్కృతిని ధ్వంసం చేయాలనీ, విదేశీ సంస్కృతిని మన నెత్తిన రుద్దాలనీ చేస్తున్న ప్రయత్నంలో ఇదీ ఓ భాగం. అందుకే వాణిజ్య ప్రకటనలన్నీ అలాగే ఉంటున్నాయి.
సుబ్బలష్షిమి:
ఉన్న సంస్కృతిని ఊడగొట్టుకుని, లేనిది అతుకులేసుకుని, త్రిశంకు స్వర్గంలోకి ప్రయాణమన్న మాట!
Friday, January 1, 2010
Subscribe to:
Post Comments (Atom)
నిమిషాలు నిడివి వుండే ప్రకటనల్లో అలా నటించి ..
ReplyDeleteవాళ్ళు సంపాదించేది ..
మా నాన్నగారి మొత్తం ఆదాయం కన్నా ఎక్కువేమో అండి ..
bagundi..
ReplyDelete23 DECEMBER 2008 నుండి 1 JANUARY 2010 దాకా ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ బ్లాగు చూడండి..
http://creativekurrodu.blogspot.com/
Happy New Year :)
ప్రకటనలకి సెన్సార్ బోర్డ్ ఉండదో ఏవిటో .....
ReplyDelete