[ధరల పెరుగుదల విషయమై భాజపా పార్టీ వాళ్ళు ప్రధాని కలిసిన వార్త నేపధ్యంలో ]
సుబ్బలష్షిమి:
బావా! భాజపా వాళ్ళు ప్రధానిని ధరల పెరుగుదల విషయమై కలవగా, ప్రధాని, "పప్పులు, కూరగాయలు, పంచదార తప్ప ఇంకేమీ పెగరలేద"ని అన్నారట! సుష్మాస్వరాజ్ చెబుతుంది.
సుబ్బారావు:
అది నిజమే అయితే, ప్రధానిని మన ఉళ్ళో కిరాణా కొట్లో కూర్చోబెట్టాలి. అప్పుడు తెలుస్తుంది అతడికి అన్ని వస్తువుల ధరలు పెరిగిన విషయం! దీన్నే అంటారేమో కడుపునిండినప్పుడు కడుపునిండిన మాటలని!
Sunday, January 24, 2010
Subscribe to:
Post Comments (Atom)
ధరలు పెరగటం అనివార్యం. తంబలు తంబలుగా జనాభా పెరిగిపోతూ, వ్యవసాయం పూర్తిగా కుంటుపడినప్పుడు ఆహారధాన్యాల ధరలు పెరగటంలో ఆశ్చర్యమేముంది. ప్రభుత్వం కొంతవరకే ఏమైనా చేయగలదు. ఇంకా ముందున్న రోజుల్లో నీటికి ఆహారానికి తీవ్ర కొరత ఏర్పడవచ్చు. జనాభా అర్జంటుగా స్థిరీకరింపబడాలి. అటుపిమ్మట తగ్గాలి. ఊరికే ప్రభుత్వం మీద గోలచేస్తే లాభంలేదు.
ReplyDeleteనిజమే ఎక్కడ పెరిగాయి,పెరగలేదు గనుకనే పార్లమెంటు క్యాంటీన్ లో రూపాయికి పుల్లుభోజనం,అర్థరూపాయికి మన ఎంపీలు తినేటంత టిఫిన్ పెడుతున్నారు.
ReplyDeleteచిలమకూరి విజయమోహన్ గారు : చాలా రోజుల తర్వాత మళ్ళీ వ్యాఖ్య!:) నెనర్లు.
ReplyDeleteఅజ్ఞాత గారు : మీరు మరి అమాయకంగా ఉన్నట్లున్నారు. బ్లాక్ మార్కెటింగ్, దొంగ వే బిల్లులతో రాష్ట్ర సరిహద్దులు దాటుతున్న లారీలు గట్రా విషయాలు తెలుసుకుంటే మీకే తెలుస్తుంది, ధరలు ఎందుకు పెరుగుతాయో! నెనర్లు!