Saturday, December 4, 2010

సోనియా అంటే మీడియాకి అంత ప్రేమ మరి!

[మండిపోతున్న కూరగాయలు, నిత్యావసరాల ధరల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఉల్లిపాయలు కిలో ఇరవై నాలుగు రూపాయలట. కూర గాయల ధరలేవీ అందుబాటులో లేవు. నూనెల ధరలూ, నిత్యావసరాల ధరలూ అంతే! ఆకాశంలో విహరిస్తున్నాయి, ఇదేం విపరీతం బావా!?

సుబ్బారావు:
ఇది విపరీతం కాదు మరదలా, ఇటలీ మహిళ నేతృత్వం! ఒకప్పుడు ఉల్లి ధరలు పెరిగితే ఇందిరాగాంధీని చెరిగి ఆరేసింది మీడియా. చివరికి భాజపా ప్రభుత్వమూ ఉల్లి ధరలకి రెక్కలొచ్చినప్పుడు ఇబ్బందులకి గురయ్యింది. అదే ఇప్పుడు చూడు! సోనియాని మీడియా… ఇందిరనో, రాజీవ్ నో రచ్చ పెట్టినట్లు పెడుతోందా? మీదు మిక్కిలి రక్షించుకొస్తోంది.

కావాలంటే నువ్వే పరిశీలించు! 65 కోట్ల రూపాయల భోపోర్సు అవకతవక గురించి బయటికొచ్చినప్పుడు దాదాపు ప్రతీ పత్రికా, ప్రతీ పేజీలో క్రమం తప్పకుండా వ్రాసి రాజీవ్ ని ఉతికి ఆరేసారు. ఇప్పుడు ప్రపంచంలోనే అతి పెద్ద అవినీతిగా చెప్పబడిన 1.76 లక్షల కోట్ల రూపాయల 2జీ స్పెక్ట్రమ్ వ్యవహారంలో… అంత రేంజ్ లో వ్రాస్తున్నారా? అసలు రోజుకో అవినీతి బయటికొస్తోంది. అయినా మీడియా దాన్ని వీలయినంత చల్లారుస్తోంది.

సుబ్బలష్షిమి:
అవున్నిజమే! ఎందుకలా బావా!?

సుబ్బారావు:
ఎందుకంటే – సోనియా అంటే మీడియాకి అంత ప్రేమ మరి!

సుబ్బలష్షిమి:
ఓహో! సోనియా మీడియాలు “ఈనాటి ఈ బంధమేనాటిదో!” అని యుగళ గీతాలు పాడుకోవచ్చన్న మాట!

5 comments:

  1. why?do u know this naked truth..?including the hindu nd eenaadu ,there r other 50 electronic+print medias were runnig on christian missonary funds on the recomadations of sonia in india.

    ReplyDelete
  2. astrojoyd గారు : దీనితో పాటు మరో విశేషం కూడా ఉందండి. మన దేశంలో ఉన్న మొత్తం మీడియా కేవలం ఐదు పత్రికా సంస్థల చేతుల్లో ఉందని తెహల్కా డాట్ వారు ఆరోపించారు. అందుకే ఇంత వ్యవస్థీకృతంగా నడపగలుగుతున్నారు. నెనర్లు!

    ReplyDelete
  3. అప్పట్లో ఉల్లిఘాటుకు ప్రభుత్వాలే ( సుష్మాస్వరాజ్-ఢిల్లీ) కూలిపోయాయి. అదేంటో ఇప్పుడు మొత్తం అన్ని కూరగాయల ధరలూ పెరిగినా కూడా ఏ ప్రభుత్వం కూలడం లేదు. అదే మరి మీడియా పవర్

    ReplyDelete
  4. నేనూ ఇదే అనుకుంటున్నాను... ఇక్కడ ఇదే చర్చిస్తూ ఉంటాం... ఇంత భారీ స్కాం ప్రపంచం లో మన దేశాన్ని ఒక వైఫల్య దేశం గా చూసేరోజుకి దారి తీస్తుంది...ఇంతటి అవకాశాన్ని కేవలం పార్లమెంట్ లోనే కాకుండా ... దేశం మొత్తం ప్రతిపక్షం ఎందుకు ఆందోళన లు చేయటం లేదు... చూస్తుంటే ముసుగులో గుద్దులాటలా ...దాచిపెట్టబడ బోతుంది అనిపిస్తుంది.... జేపీ లాంటి వారూ అవగాహనా , చర్చా , యాత్రలకి శ్రీకారం చుట్టదానికి ఏంటి అడ్డంకి ? ఇది అవినీతికి పరాకాష్ట ... మరి ఎంతో కృషి ఉన్న నాయకులు కూడా నోర్లు ఎందుకు మూస్కున్నారు... నిజం గా డేశం పాకిస్తాన్ లాంటి పక్కన నిలబడ బోతుందా ?

    ReplyDelete
  5. భారతదేశంలోని పత్రికలన్నింటినీ కేవలం ఐదు సంస్థలే శాసిస్తున్నాయా?
    http://wwwammaodi.blogspot.com/2009/12/blog-post_04.html

    ReplyDelete