Tuesday, December 7, 2010

రతన్ టాటా పారిశ్రామిక వేత్తే కాదు, కొత్త భాషా వేత్త కూడా!

[నీరా రాడియాతో లబ్ధి పొందలేదు, ఎన్డీటీవీ ఇంటర్యూలో రతన్ టాటా స్పష్టీకరణ నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! టెలీఫోన్ రంగంలో వ్యాపారం చేస్తున్నప్పటికీ… టాటా గారు, నీరా రాడియాతో లబ్ది పొందలేదట తెలుసా?

సుబ్బారావు:
టాటా గారు లంచాలివ్వరు మరదలా! బహుమతులిస్తారు. అలాగే బహుశః నీరా రాడియాతో ‘లబ్ది’ పొంది ఉండరు, ‘ప్రయోజనాలు’ పొంది ఉంటారు. అందునా ఆయనెంత పత్తిగింజ గారంటే… రెండేళ్ళు గడిచినా 2008 సెప్టెంబరు 26 నాటి ‘తాజ్ హోటల్ మీద పాక్ ముష్కరుల దాడి’లో, టాటా గారి తాజ్ హోటల్ గదిలో బయటపడిన టెర్రరిస్టుల కంట్రోలు రూం కి ఎవరు సహకరించారో… ఇప్పటికీ బయటకు రాకుండా మానేజ్ చేసుకుంటున్నారు.

అదీ కేంద్రప్రభుత్వంలో, అందులోని కీలక వ్యక్తులతో రతన్ టాటా గారి గాఢనుబంధం!

సుబ్బలష్షిమి:
ఇంకా పైగా, నీరా రాడియాతో తన సంభాషణలు బయట పెట్టరాదని, అది తన Right of Privacy కి భంగకరమనీ సుప్రీం కోర్టులో దావా వేసాడు తెలుసా?

సుబ్బారావు:
సాగితే అలాగే ఉంటారు మరి! అతడి హోటల్ లో బస చేసిన పాపానికి బ్రతికే హక్కు పోగొట్టుకున్నారు కొందరు. మరో ప్రక్క సమాజంలో చాలామందికి చాలా హక్కులు మృగ్యమై ఉన్నాయి. మరి ఇతడు కార్పోరేట్ దిగ్గజం కదా! అంచేత అన్ని హక్కులే ఉంటాయి. తన హోటల్ లో ఉగ్రవాదులకు కంట్రోలు రూం ఎలా ఏర్పరచబడిందో తెలిపేపాటి బాధ్యతలు కూడా ఉండవు. మరి ఇతడి నిఘంటువు ప్రత్యేకమైనది కదా!

సుబ్బలష్షిమి:
ఇంతగా తమ ఆటలు సాగనిస్తున్నారు కాబట్టే… మన్మోహన్ సింగ్ లభించడం మన అదృష్టం అంటూ స్టేట్ మెంట్లు ఇస్తున్నట్లున్నాడు బావా!

సుబ్బారావు:
మన అదృష్టం అంటే అతడి నిఘంటు అర్ధం తమ వంటి కార్పోరేట్ దిగ్గజాల అదృష్టం అని అయి ఉంటుంది మరదలా!

సుబ్బలష్షిమి:
ఓహో! అయితే వీరి పరిభాషలో లంచాలని బహుమతులనీ, లబ్ధిని ప్రయోజనాలనీ… ఇలా వాడుక పదాలని మార్చాలన్న మాట! బాగుంది బావా, టాటా గారి నిఘంటువు!

మొత్తానికీ ఇన్నాళ్ళు ఇతణ్ణి పారిశ్రామిక వేత్తే అనుకున్నాం, గొప్ప భాషావేత్త కూడా!

2 comments:

  1. $..అయితే వీరి పరిభాషలో లంచాలని బహుమతులనీ, లబ్ధిని ప్రయోజనాలనీ…..రతన్ టాటా గొప్ప భాషావేత్త కూడా!

    నిజమే.. లేస్తే పక్కోల్లకు నీతుల నూతుల గురించి చెప్పేవాడికి ఖచ్చితంగా ఏదొ ఒక "వేత్త" అవ్వాల్సిందే.

    ఈ రోజు వార్థ చూశారా? ఛీ..ఛీ.. టాటా గారు(?) ఎంత దరిద్రముగా దిగజారి మాట్లడుతున్నడొ.. ఈ రాడియా జూదం ప్రధానిని అవమానించడానికి.. పాలక పక్షాన్ని ఆడిపోసుకోవాడానికట!.. కటా..కటా..సిగ్గు..సిగ్గు.. అందులో తన పాత్ర ఎంత ఉందో వివరణ ఇచ్చుకోవాల్సింది పోయి... ఏది ఏమైనా 'టాటాయ్య గారు భుజాలు తడుముకున్నారు.. ఎంతవరకు అంటే 2001 నుంచి టెలెకాం అవకతవకలు ఉన్నాయనే వరకు.. మరి బయటెట్లెదే?

    ReplyDelete