Monday, November 15, 2010

బహుశః ఆ సుదర్శన్ ‘అమ్మఒడి’ చదివి ఉంటాడేమో!?

[ఆర్.ఎస్.ఎస్. మాజీ ఛీఫ్ సుదర్శన్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాపై చేసిన విమర్శల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఆర్.ఎస్.ఎస్. మాజీ అధినేత, కాంగ్రెస్ ప్రస్తుత అధినేత్రి సోనియాని, ఆమె సీఐఏ ఏజంటులా వ్యవహరిస్తోందనీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీల హత్యల్లో ఆమె కుట్ర ఉందనీ వ్యాఖ్యానించాడు, చూశావా!?

సుబ్బారావు:
ఆ విషయం ‘అమ్మఒడి’ దాదాపు రెండేళ్ళ క్రితమే చెప్పింది కదా మరదలా! బహుశః ఆ సుదర్శన్ ‘అమ్మఒడి’ చదివి ఉంటాడేమో!? నిగ్రహం నిలుపుకోలేక అనేసి ఉంటాడు. లేదా ఆత్మహత్యా సదృశ్య ఎసైన్‌మెంట్ రీత్యా మాట్లాడి ఉంటాడు, మరదలా!?

సుబ్బలష్షిమి:
అది నిజమే అయినా, కాంగ్రెసోళ్ళు తెగ గింజుకుంటున్నారు, బావా!

[ 35. ఈ అమ్మకింత బలం – ఇంత శక్తి ఎలా వచ్చాయబ్బా? – 1 [Jan.06, 2009]
http://ammaodi.blogspot.com/2009/01/1.html

36. ఈ అమ్మకింత బలం – ఇంత శక్తి ఎలా వచ్చాయబ్బా ? – 2 [Jan.07, 2009]
http://ammaodi.blogspot.com/2009/01/2_07.html ]

9 comments:

 1. హ్మ్.. అమ్మగారి గురించి "అమ్మ ఒడి", బావుంది :). సుదర్శనం గారికి అవి(గొలుసులు) ఇప్పుడే రోశయ్య గారి చేత బట్వాడా
  చేయిస్తా :)..

  ఆఖరికి రోశయ్య గారు కూడా రొడ్డెక్కారు... కాశ్మీరుని ఇటలీలో కలపాలన్నందుకు... హెంత 'అమ్మా ప్రేమో...

  ReplyDelete
 2. అటువంటి మాటలన్నందుకు అతనికి, ఖండించకుండా సమర్ధించినందుకు బి జె పి కి ,రాసినందుకు మీకు త్వరలోనే బుద్దిచెప్పే రోజు కోసం ఎదురుచూడండి.

  ReplyDelete
 3. ముందు సుబ్రహ్మణ్య స్వామి, తరువాత అమ్మఒడి, తరువాత సుదర్శన్ .. ఇంకెన్ని వస్తాయో మన దేశానికి పట్టిన ఈ శని గురించి నిజాలు

  ReplyDelete
 4. పబ్లిక్ స్పేస్ లో డిబేట్ ఎంత దిగజారిపోయిందో రోజూ అనేక మంది రుజువు చేస్తూనే ఉన్నారు. అందులో సుదర్శన్ కూడా చేరారు.

  ReplyDelete
 5. రాజేష్ గారు, అజ్ఞాత గారు, weekend politician గారు: నెనర్లండి.

  నీహారిక గారు:
  మీ వ్యాఖ్య చూశాక నాకు ఇటలీ నియంత ముస్సోలిని (మొదట పత్రికాధిపతి, తరువాత ఇటలీ అధినేత, ఆ తరువాత నియంతగా రూపొందాడు.) వ్యవహారం గుర్తొచ్చింది. అతడి హయాం ముగిసి 65 ఏళ్ళయ్యాకా, అదీ అతణ్ణి ప్రయోగించిన బ్రిటన్ గూఢచార సంస్థ MI 5 స్వయంగా ప్రకటించాకా ‘ముస్సోలినీ బ్రిటన్ ఏజంట్’ అని తెలిసి ప్రజలు నోరెళ్ళ పెట్టారు. బహుశః, అప్పట్లో, ఆ విషయం గురించి ఎవరైనా అంటే... ఇప్పటి సోనియా అభిమానుల్లాగే, అప్పటి ముస్సోలినీ అభిమానులూ అరిచి ఉంటారు. సంవత్సరం క్రితం ఆ విషయం గురించి టపా వ్రాసాను. దిగువ లింక్ చూడండి.

  ఏది ఏమైనా... అసత్యం ఎవరు చెప్పినా... వాళ్ళకి బుద్ది చెప్పబడాల్సిందే! అందుకు మీరూ, నేనూ, సోనియా, సుదర్శన్... ఎవరూ అతీతులు కారు! :) నెనర్లు.

  232. నకిలీకణికుడి వ్యవస్థ గురించి కొన్నిదృష్టాంతాలు [Circumstantial] – 6 [ముస్సోలినీ బ్రిటన్‌ గూఢచారి!] [Oct. 18, 2009]
  http://ammaodi.blogspot.com/2009/10/circumstantial-6.html

  ReplyDelete
 6. సోనియా ఈ దేశానికి పట్టిన శని కాదు. ఈ దేశానికి ఉన్న ఒకే ఒక దిక్కు. కాంగ్రెస్ స్థాపించి 125 సంవత్సరాలయినా ఒక బలమైన పతిపక్షాన్ని తయారుచేయలేకపోయిన ఈ దేశ ప్రజల చేతకానితనానికి నిలువెత్తు నిదర్శనం. ఎక్కడో పుట్టి ఇక్కడ పుట్టిన భారతీయులను ఉద్దరిస్తున్నందుకు ఆమెకు ఏమిచ్చినా ఋణం తీర్చుకోలేరు, కేవలం సిగ్గుపడటం తప్ప.

  ReplyDelete
 7. ఆదిలక్ష్మి గారు,

  మీకు "ఊరంతా ఒక దారైతే ఉలిపికట్టెది ఒక దారి" అన్న సామెత తెలియంది కాదు. అలాంటివాళ్ళు బ్లాగ్లోకములో కూడా అక్కడక్కడా, షోఅప్ కోసం. అలాంటి వాఖ్యలు పట్టించుకుంటే సమయం వృధా తప్ప ఏమీ ఉండదు. మీ విలువైన సమయాన్ని టపాకాయలకి ఉపయోగించండి :) మీకు అర్థం అయ్యింది అనుకుంటా! :)

  ReplyDelete
 8. అమ్మ నీహారిక ముందు నీ సంగతి చూసుకొని సిగ్గుపడు తరవాత సమాజాన్ని ఉద్దరిద్దువు . ఊ బయలు దేరింది , నువ్వు నీ అజ్ఞాత కామెంట్ల బతుకు అందరికి తెలుసు గాని కొద్ది గా ముయ్యి ఇక్కడ . ఆ ఎర్రగడ్డ లో ఇంకా బెడ్ దొరకలేదా నీకు .

  ReplyDelete
 9. /ఎక్కడో పుట్టి ఇక్కడ పుట్టిన భారతీయులను ఉద్దరిస్తున్నందుకు ఆమెకు ఏమిచ్చినా ఋణం తీర్చుకోలేరు, కేవలం సిగ్గుపడటం తప్ప. /
  హ్వా హ్వా హ్వా..
  ఇలాంటి వోటర్లుంటే ఇటలీ ఏం ఖర్మ సోమాలియా, ఉగాండాల నుంచి కూడా ఉద్దరించడానికి నాయకులు వస్తారు. :))

  ReplyDelete