Monday, February 23, 2009

49. వడ్డించే వాడు మనవాడయితే ఎక్కడ ఉన్నా అన్నీ అందుతాయి

[ప్రభుత్వం, ఈనాడు పత్రికకి భారీ ఎత్తున ప్రకటనలు ఇస్తూన్న నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా నాదో సందేహం! ముఖ్యమంత్రి వై.యస్. తనకి నచ్చినట్లు రూల్స్ మార్చుకుంటాడని, తనకి నచ్చని వాళ్ళని సాధించటానికి రూల్స్ అన్ని తుంగలో తొక్కేస్తాడని మాట ఉంది కదా! మరి ఈనాడు పత్రిక ప్రకటనల విషయంలో ఎందుకని రూల్స్ అన్ని తుంగలో తొక్కడం లేదంటావు?

సుబ్బారావు:
అంతే మరదలా! మాటల్లో కొట్లాట, చేతల్లో సాయం అన్నమాట. లేకపోతే రామోజీ రావుని ఆర్దికంగా ఆదుకొనేదెట్లా?

సుబ్బలష్షిమి:
దీన్నే అంటారేమో, ‘వడ్డించే వాడు మనవాడయితే ఎక్కడ ఉన్నా అన్నీ అందుతాయని!’

*****************

5 comments:

  1. ఈనాడు కి ప్రకటనలు ఇవ్వడం లో అంతర్యం ఏంటంటే లక్ష లాది పాఠకులు చదివే దిన పత్రిక లో రోజుకో అవినీతి భాగోతం ప్రభుత్వం మీద రాసే పత్రికా లో ముందు పేజి లోనే అది ఈనాడు రాసిందేమో అన్న బ్రాంతి కలిగించేలా ఎక్కడ కూడా advt అని రాయకుండా సామాన్య ప్రజల్ని తిరకాసు పెట్టడమే ysr ముఖ్యోద్దేశం తప్ప రామోజీ ని బాగు పరుద్దామని కాదు , మీరు అ advt ని గమనిస్తే ఇది ఈనాడు చెప్పే నిజం అంటు తాటికాయంత అక్ష రాలలో కూడా రాస్తున్నారు దాన్ని బట్టి ఓహో ఇది ఈనాడు చెపుతోంది గామోసు అయితే వైయస్ మంచి పనులు చేస్తున్నాడన్న మాట అని పాఠకులు అనుకోవాలని .ఒకసారి ఎన్నికల scedule డిక్లేర్ అయితే ఈ పప్పులు వుడకవు అందుకే ఈ ఆత్రం .

    ReplyDelete
  2. రవిగారు,
    మరి ఇదంతా రామోజీరావు ఎందుకు entertain చేస్తునట్లు?

    ReplyDelete
  3. ఇప్పటికే సుమన్ , mrs కిరణ్ ,పెట్టిన ఆర్దిక బొక్కలు పూడ్చు కోడానికి కొన్ని యుగాలు పట్టేలా వుంది. ఇటువంటి పరిస్తితి లో కోట్ల రూపాయలు advt రూపం లో వస్తే చేదా?యెంత వారలైన డబ్బు దాసులే అని మార్చుకుని పాడుకోవలసిన పరిస్తితి .

    ReplyDelete
  4. రవిగారూ,

    ఎంతవారలైనా డబ్బుదాసులే అన్నమాట బాగుంది. అలాగే రామోజీరావు కూడా అదే వర్గానికి చెందుతాడన్న మీమాటనీ నేను అంగీకరిస్తాను. అందులో మీరు నాకు కొత్త సమాచారం ఇచ్చారు. ఇప్పటి వరకూ రామోజీరావు రెండో కుమారుడు సుమన్ ఈటీవి కి బోలెడు లాభాలు తెచ్చిపెట్టాడనే విన్నాను. అలాగే అతడి పెద్దకోడలు శైలజా కిరణ్ కళాంజలి షోరూములనీ, మార్గదర్శి బ్రాంచీలని ప్రారంభిస్తూ పోవడమే నాకు తెలుసు. వాళ్ళిద్దరూ రామోజీరావుకి ’ఆర్ధిక కన్నాలు’ ఎలా వేసారో తెలియదు. ఈ విషయమై మరిన్ని వివరాలు చెప్పగలరు.

    ReplyDelete
  5. అవన్నీ వివరం గా రాయాలంటే నేను కూడా'' నాన్న ఒడి '' అని ఇంకో బ్లాగ్ పెట్టి ఈటీవీ సీరియల్స్ లాగ రాయలిసి వుంటుంది .ఇప్పటికే ఉండవల్లి ఉండుండి బయట పెడతా బయట పెడతా అంటు రామోజీరావు గారి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంటే వాళ్ళ auditors యధాలాపంగా నాకు తెలియ చేసిన detailes బయట పెడితే ఈటీవీ కాస్త మీ టీవీ అవుతుంది.

    ReplyDelete