Wednesday, May 26, 2010

మీడియా నిఘంటువులో లజ్జా బిడియాలనే పదాలుండవు!

[టెన్నిస్ క్రీడాకారిణి రుచికా పై, హర్యానా పోలీసు మాజీ డీజీపీ రాధోడ్ లైంగిక వేధింపు, ఆత్మహత్యకు పురికొల్పటం కేసులో కోర్టు తీర్పు - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! రుచికా అనే ఈ అమ్మాయి కేసు చదివావా! 20 ఏళ్ళ క్రితం 14 ఏళ్ళ అమ్మాయిని పోలీసు ఉన్నతాధికారి లైంగికంగా వేధించాడు. కేసు పెట్టినందుకు ఆమె కుటుంబాన్ని, ఆమె స్నేహితురాలి కుటుంబాన్ని వేధించాడు. కేసు తెమలడానికి 20 ఏళ్ళుపట్టింది. 17 ఏళ్ళ క్రితమే అన్యాయానికి గురైన రుచికా ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. మహిషానికి మారుటి తమ్ముడు లాంటి రాధోడ్ కి మాత్రం, ప్రభుత్వం నుండి పదోన్నతి వచ్చింది. విశిష్ట సేవలకు[?] గుర్తింపుగా పసిడి పతకాలూ వచ్చాయి. నానా వెతలూ, వేధింపులూ పడి, రుచిక స్నేహితురాలు ఆరాధనా గుప్తా కోర్టులో పోరాడితే, అతగాడికి ఆరునెలలు జైలు శిక్ష పడింది. చివరికి దాన్ని 1 1/2 సంవత్సరాలుగా మార్చారు.

ఈ వార్త గురించి ఈనాడు పత్రిక ‘ఓ మగువ తెగువ’ అని వ్రాస్తూ.... ‘అటు మీడియా ఇటు స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఆరాధనా గుప్తా పోరాడిందని’ వ్రాసింది తెలుసా?

సుబ్బారావు:
మీడియా సహకరిస్తే అసలా కేసు 20 ఏళ్ళు సాగేదా? పద్నాలుగేళ్ళ పసిపిల్ల అవమానానికీ, కుటుంబ వేధింపులకీ గురయ్యి ఆత్మహత్య చేసుకునేదా? కేసుపెట్టి పోరాడిన ఆరాధనా గుప్తా, కుటుంబంతో సహా వేధింపులకి గురయ్యేదా? ఆ రాధోడ్ కి పదోన్నతులూ, పతకాలూ వచ్చేవా? ఇంతా చేసి ఆ దుష్టుడికి పడింది తొక్కలోది ఆరునెలలు శిక్ష! ఇంకా కొనసాగిస్తే చివరికది ఒకటిన్నర సంవత్సరాలైంది. ఈపాటి దానికి ‘మీడియా సహకరించింది’ అని వ్రాసుకోవటానికి పత్రికా విలువలు అడ్డం రాకపోయినా, కనీసం లజ్జా బిడియాలన్నా అనిపించలేదు కాబోలు!

సుబ్బలష్షిమి:
లజ్జా బిడియాలా? మీడియాకి అసలా పదాలు నిఘంటువులోనే ఉండవు బావా!

5 comments:

 1. నేను వార్త చదివినప్పుడే అనుకున్నాను మీరు ఈ విషయంపై తప్పక టపాకాయ పేల్చుతారని.ఆ దరిద్రునికి కేసు సాగినన్ని సంవత్సరాలు వేసి ఉంటే సంతోషించేవాళ్ళం.నిజంగానే సిగ్గులేదు వీళ్ళకు .ఎప్పటికైనా న్యాయం గెలుస్తుందని రుజువయిందని వ్రాశారు.న్యాయం గెలవడానికి ఏళ్ళూ పూళ్ళూ గడవాలా? ఇంతగా మానసికంగా,ఆర్థికంగా కష్టపడాలా?అయినా అన్ని కేసుల్లో ఈ పట్టుదల అందరికీ ఉంటుందా?

  ReplyDelete
 2. నిజమండీ. బాగావ్రాసారు. దీనికి ఈనాడు వారి సమాధానం వినాలని ఉంది. అవునూ ! మీ బ్లాగుల్లో రోజూ రామోజీరావుగారిని ఉతికి, ఇస్త్రీపెట్టి ఆరేస్తుంటేనే ఎప్పుడూ కిమ్మని కూడా స్పందించకపోవడంలోనే తెలుస్తుంది కదా మాళ్ళ కున్న సిగ్గూ లజ్జా ఏలాంటివో.?

  ReplyDelete
 3. good post, ma'am.

  visit my blog on AP Media
  apmediakaburlu.blogspot.com

  ramu

  ReplyDelete
 4. AMMA ODI గారూ...,

  నమస్కారం. క్రొత్తగా నేను హారం ప్రచార బాధ్యతను తీసుకున్నాను. కాబట్టి హారం గురించి
  ఓ నాలుగు మాటలు చెప్పుకుందామని మీ బ్లాగు తలుపు తడుతున్నాను. హారం ను మీరు చూడాలంటే ఈ లింకు పైన నొక్కండి. హారం ప్రతి ఐదారు
  నిమిషాలకు మీ బ్లాగునుంచి టపాలను సేకరించి చూపిస్తుంది. అంతే కాక మీరు,
  మనతోటి బ్లాగర్లు వ్రాసిన టపాలను గానీ వ్యాఖ్యలను చూసుకోవడం చాలా సులభం. హారంలో వ్యాస రచయితల పేర్లు, వ్యాఖ్యాతల పేర్ల పైన క్లిక్ చేసి సులభంగా వారి వారి వ్యాసాలను,వ్యాఖ్యలను చూసికొనే వీలుంది.

  తాజా టపాలనే కాక బ్లాగుల్లో లభ్యమయ్యే జ్ఞానాన్ని వివిధవర్గాలగా క్రోడీకరించి, గత నాలుగు సంవత్సరాలుగా
  తెలుగు తల్లి నోటినుంచి రాలిన ముత్యాలను గుదుగుచ్చి మీ ముందుంచుతుంది. ఈ ప్రయత్నంలో
  హారం ప్రస్తుతానికి ఆధ్యాత్మికం, పద్య సాహిత్యం, సాంకేతికం, హాస్యం, పాటలు,సినిమాలు, బొమ్మలు,సంగీతం, కవితలు, బాలసాహిత్యం, వంటలు మొదలైన వర్గాలుగా క్రోడీకరించి చూపిస్తుంది. .

  మీ సౌకర్యాన్ని బట్టి వీలును బట్టి ఓ సారి దర్శించండి. నచ్చితే వాడండి. ఇంకా నచ్చితే మీబ్లాగులో హారం లింకు ను వుంచి ప్రోత్సహించండి. హారం లింకు ఇక్కడ నుండి సంగ్రహించి మీ బ్లాగులో వుంచవచ్చు. అభిప్రాయాలను దయచేసి ఇక్కడ తెలుపండి . టపాకు ఏమాత్రం సంబంధం లేని వ్యాఖ్య వ్రాసినందుకు క్షమించండి.

  - హారం ప్రచారకులు.

  ReplyDelete
 5. చిలమకూరు విజయమోహన్ గారు: నిజంగా చాలా కోపమొచ్చే విషయమేనండి. చూద్దాం ఎప్పటికి పత్రికలవాళ్లకి లజ్జాబిడియాలు తెలుస్తాయో!నెనర్లు!

  మల్లిన నరసింహ గారు: ఆ కుతూహలం మాకూ ఉందండి! మీ వ్యాఖ్యని చాలా ఆనందించాం!:) నెనర్లు!

  రామూ గారు: మేము తరచు చదివే బ్లాగుల్లో మీ బ్లాగు కూడా ఒకటి. విషయాలు తెలియాలి కదా! నెనర్లు!

  హారం గారు: మా బ్లాగులో హారం ఎప్పటి నుండో ఉందండి!

  ReplyDelete