Friday, May 28, 2010

వీళ్ళా దేశాలకు ప్రధమ మహిళలూ, ప్రముఖ మహిళలూ?

[కార్లా బ్రూనీ గతంలో ఇచ్చిన ఇంటర్యూ బయటకు పొక్కిన వార్త నేపధ్యంలో...
>>>లండన్: ఒకప్పుడు అందాల మోడల్‌గా ఓ వెలుగు వెలిగి, ప్రస్తుతం ఫ్రాన్సు ప్రథమ పౌరురాలైన కార్లా బ్రూనీ.. ఇప్పుడు తల పట్టుకుంటున్నారు. గతంలో ఆమె ఇచ్చిన ఓ ఎక్స్-రేటెడ్ ఇంటర్వ్యూ ఇప్పుడు వెలుగు చూడటమే ఆ తలనొప్పికి కారణం.

28 ఏళ్ల వయసులో ఉన్నపుడు చానల్4లో వచ్చే యూరోట్రాష్ అనే షోలో ఆమె పాల్గొన్నారు. అందులో 'మీకు నా వక్షోజాలు నచ్చాయా' అని కూడా అడిగారు. తన హ్యాండ్‌బ్యాగ్‌లో ఎప్పుడూ ఉండే 'సెక్స్ ఫ్రేజ్ బుక్' నుంచి ఈ వాక్యాన్ని జర్మన్, ఇటాలియన్, స్పానిష్ భాషల్లో చూసుకుని మరీ అడిగారు.

"మనం ప్రపంచమంతా తిరుగుతూ, రకరకాల వ్యక్తులను కలుస్తాం. కాబట్టి ఇలాంటి పుస్తకాలు మనవద్ద ఎప్పుడూ ఉండాలి. వాళ్లతో పడక పంచుకోవాలంటే ఏం చెప్పాలో మనకు తెలియాలి'' అంటూ బ్రూనీ సవివరంగా చెప్పారు.

రాక్‌స్టార్లు మిక్ జాగర్, ఎరిక్ క్లాప్‌టన్ సహా పలువురితో తనకున్న ఎఫైర్ల గురించి కూడా ఆమె చర్చించారు. 'ఒకరితోనే ఉండటం నాకు బోర్' అని ఆమె 2007లో చెప్పిన మాటలనే ఆ వీడియోకు టైటిల్‌గా పెట్టారు.]

సుబ్బలష్షిమి:
బావా! ఫ్రాన్స్ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీ మూడవ భార్య కార్లా బ్రూనీ, గతంలో మోడల్ గా పనిచేసినప్పుడు పత్రికలకు నగ్నంగా ఫోటో ఫోజులిచ్చింది. అప్పట్లో ఇంటర్యూలు కూడా ఇచ్చిందట. అలాంటి ఒక ఇంటర్యూ ఇటీవల బయటికొచ్చింది. ఆ వార్తాంశం చదివావా?

సుబ్బారావు:
ఇలాంటి వాళ్ళని మామూలుగా అయితే ‘వేశ్యలు’ అంటారు మరదలా! ఫ్యాషన్, వాణిజ్య రంగాలలో అయితే మోడళ్ళు అంటారు. వీళ్ళే... ప్రముఖ రాజకీయ నాయకులనో, రాజకీయ నాయకుల కుటుంబ సభ్యుల్నో, ప్రేమలో పడేసి పెళ్ళి చేసుకుంటే.. ఆ దేశంలో ప్రధమ మహిళలూ, ప్రముఖ మహిళలూ అయిపోతారు.

సుబ్బలష్షిమి:
ఇంకా నయం బావా! అంతటితో ఆగారు! వాళ్లని ప్రధమ మహిళలూ, ప్రముఖ మహిళలూ అనటం గాకుండా ‘ఆదర్శ మహిళలూ’ అని ఉంటే మరింత భయంకరంగా ఉండేది.

5 comments:

 1. యాహూ లోని న్యూస్ మాట్టర్స్ కూడా తెనిగించి బ్లాగుల్లో ప్రదర్శించవచ్చని మీ వ్యాసం చూసినతర్వాతే తెలిసింది /జయదేవానందశాస్త్రి -చెన్నై

  ReplyDelete
 2. నిజానికి ప్రత్యక్షంగా తప్పు ప్రజలది కాదు ఎందుకంటే సర్కోజీని ఎన్నుకునే సమయానికి ఆవిడని పెళ్ళాడలేదు. గౌరవప్రదమైన పదవిలో ఉండి అలాంటి అమ్మాయిని పెళ్ళి చేసుకోవడం ద్వారా ఎలాంటి సందేశాన్ని ప్రజల్లోకి పంపుతున్నాను అనే స్పృహ లేకుండా పెళ్ళి చేసుకున్న పెద్దాయనది తప్పు.

  ReplyDelete
 3. మన ప్రతిభ మొన్నటి దాక వివిధ విషయాల్లో తల నొప్పి తెచ్చిన చైనా కి పోవటం ఎంతవరకు సమంజసం.. అంటే వాళ్ళ కాళ్ళ దగ్గరి కుక్కనా కాంగ్రెస్ ప్రభుత్వం...

  ReplyDelete
 4. ‘……….మరి మహిళా సాధికారత ’ మాటేమిటి?

  స్త్రీ లైంగిక స్వేఛ్ఛమాటేమిటి?

  స్త్రీవాద కవయిత్రులు (ఓల్గా వగైరాల) మాటేమిటి?

  ReplyDelete