Tuesday, June 1, 2010

ప్రజాస్వామ్యం అంటే ప్యాకింగ్ మారిన రాజరికమే!

[బ్రిటన్ కొత్త ప్రధానమంత్రి కామెరూన్ రాజవంశీయుడు - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! బ్రిటన్ వంటి యూరప్ దేశాలలో, ప్రజాస్వామ్యపు ఎన్నికల్లో గెలిచేది, సగానికి సగం మంది కులీనులు, రాజ వంశీయులేనట. బ్రిటన్ కొత్త ప్రధానమంత్రి కామెరూన్ రాజవంశీయుడే తెలుసా?

సుబ్బారావు:
మన దేశంలోనైనా అదే నడుస్తోంది కదా మరదలా! మొన్నటి పార్లమెంట్ ఎన్నికలలో చాలా మంది రాజవంశీయులే ఎన్నికలలో పోటీ చేసారు. పూసపాటి గజపతులు, సింధియాలు, చౌహాన్ లు. చాలామంది, బ్రిటీషు వాళ్ళకి పాలెగాళ్ళుగా పనిచేసిన మాజీ రాజవంశీయులే!

సుబ్బలష్షిమి:
అయితే, ప్రజాస్వామ్యమంటే ప్యాకింగ్ మారిన రాజరికమా బావా?

No comments:

Post a Comment