Friday, June 11, 2010

మరెవ్వరో తమని తిట్టకముందే తమను తామే తిట్టేసుకున్నట్లు!

[భోపాల్ గ్యాస్ లీకేజీ కేసు తీర్పు - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! కేంద్ర న్యాయ శాఖామంత్రి వీరప్ప మొయిలీ వ్యాఖ్య చదివావా! ‘భోపాల్ గ్యాస్ బాధితులకు న్యాయం జరగడంలో చాలా ఆలస్యమయిందనీ, ఒకరకంగా వారికి న్యాయ తిరస్కారం జరిగిందనీ, న్యాయం సమాధి అయ్యిందనడానికి ఇదో చక్కటి ఉదాహరణ’ అనీ ప్రకటించాడు.

ఇంతకీ న్యాయాన్ని ఎవరు సమాధి చేసారు బావా! తన లాంటి రాజకీయ నాయకుల వత్తిళ్ళు, వత్తిళ్ళకి లొంగే అధికారులూ, కోర్టులూ, న్యాయమూర్తులే కదా?

సుబ్బారావు:
మరి వాళ్ళు గాక, సామాన్య ప్రజలేమైనా పలుగూ పారలు తెచ్చుకుని న్యాయాన్ని సమాధి చేసారా మరదలా! concern Seat లో ఉండి మరీ, అలాంటి ప్రకటనలు ఇచ్చారంటే... ఎంత బాధ్యతారహితంగా కాలం గడుపుతున్నారో చూడు!

సుబ్బలష్షిమి:
అంటే మరెవ్వరో తమని తిట్టకముందే తమను తామే తిట్టేసుకుంటారు చూడు బావా, కొంతమంది! సరిగ్గా ఆ ‘ట్రిక్కు’ ప్లే చేస్తున్నట్లున్నాడు ఈ న్యాయమంత్రి!

No comments:

Post a Comment