Monday, June 7, 2010

అందుకే ‘మిస్టర్ గురు’ అంత గొప్ప ఆర్ధిక వేత్త మరి!

[వినుకొండలో 11 కోట్ల రూపాయల విలువైన కందులు, కందిపప్పు అక్రమ నిల్వలు వెలుగు చూసిన వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
వినుకొండ లాంటి ఒక చిన్న పట్టణంలోనే, 11 కోట్ల రూపాయల విలువైన కందులు, కందిపప్పు అక్రమ నిల్వలు బయటపడ్డాయంటే, ఇక రాష్ట్ర వ్యాప్తంగా బియ్యం, పప్పులు లాంటి అక్రమనిల్వలు ఎంత ఉండి ఉండాలి? రిలయన్స్, మోర్ లాంటి వాటి గురించి చెప్పనే లేము. ఈ లెక్కన దేశంలో, ఏ స్థాయిలో బ్లాక్ మార్కెటింగ్ నడుస్తున్నట్లు బావా? ఈ బ్లాక్ మార్కెటింగ్ గురించి పట్టించుకోకుండా, ఆర్దిక వేత్త అయిన మన దేశ ప్రధానమంత్రి ‘ప్రపంచవ్యాప్తంగా ధరలు పెరుగుతున్నాయి’ అంటాడేం బావా?

సుబ్బారావు:
బహుశః అతడి ఉద్దేశంలో ‘ప్రపంచమంతా కూడా, ఇలాగే నల్లబజారు అమ్మకాలు నడుస్తున్నాయి, ప్రపంచమంతా ప్రభుత్వాలందుకు కొమ్ము కాస్తున్నాయి’ అని కాబోలు మరదలా! ప్రజలే సరిగ్గా అర్ధం చేసుకుకోవటం లేదు అతడి మేధస్సుని. అందుకే కదా, అమెరికా అధ్యక్షుడు ఒబామా, ప్రధాని మన్మోహన్ ని ‘మిస్టర్ గురు’ అని పిలిచింది మరి!

సుబ్బలష్షిమి:
నిజమే సుమా! అందుకే అతడు అంత గొప్ప ఆర్ధిక వేత్త మరి!

No comments:

Post a Comment