Monday, June 7, 2010

వార్తలతో బెదిరించి డబ్బు దండుకోవటమే మీడియా ప్రధాన వ్యాపారమై పోయిందిప్పుడు!

[‘ఇందు’ ప్రాజెక్టు కి కారు చౌకగా భూమి కేటాయించిన ప్రభుత్వం - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ’ఇందు’ అనే ప్రాజెక్టు కి బాచుపల్లిలో ఇచ్చిన భూమి, న్యాయపరమైన వివాదాలలో చిక్కుకుంది. ప్రభుత్వం తన విశ్వసనీయతని కాపాడుకునేందుకు, సదరు కంపెనీకి ఫిలింనగర్ లో పదెకరాలు కేటాయించిదట తెలుసా?

సుబ్బారావు:
వార్నీ! ప్రజల విశ్వసనీయత పోతే చీమ కుట్టినట్లయినా లేదు గానీ ‘ఇందు’లాంటి వ్యాపారకంపెనీల విశ్వసనీయత పోతుందని మాత్రం, జాగ్రత్త పడ్డారన్న మాట! ఎంత జాగ్రత్తంటే ఎకరా 25 కోట్లు పైనే చేసే భూమిని 11.61 కోట్లకే ఇచ్చేసేటంత!

సుబ్బలష్షిమి:
ఈవీఎం లు చేతిలో ఉండగా ప్రజల విశ్వసనీయత తో పనేమిటి బావా! అదే కంపెనీల కైతే ‘గుడ్ విల్’ పోతే వాటాలు రాలవు మరి! మరో విషయం బావా! నిన్న తొలిపేజీలో తొలి వార్త అయిన ’ఇందు’ కు భూమి విందు, ఈ రోజు మామూలుగా, ఫాలోయింగ్ వార్తలు లేకుండా మూతబడిపోయిందేం?

సుబ్బారావు:
మామూలుగా మీడియా వాటా మీడియాకి వచ్చేసి ఉంటుంది మరదలా! అందుకే కదా మరి, తొలి పేజీ తొలి వార్త వ్రాసిన పత్రిక వాళ్ళు, సదరు ‘ఇందు’ ప్రాజెక్టు ప్రమోటర్లు ఎవరో మాట మాత్రంగా కూడా వ్రాయనిది? వార్తలతో బెదిరించి డబ్బు దండుకోవటమే మీడియా ప్రధాన వ్యాపారమై పోయిందిప్పుడు!

No comments:

Post a Comment