Friday, June 25, 2010

వ్యక్తి నిరపేక్షంగా వ్రాయటానికి అద్వానీ ఏమైనా పీవీజీనా? [అద్వానీ ఆత్మకథ నుండి]

[ఆదిమ కాలం నుండి ప్రాచుర్యం చెందిన ఈ మౌఖిక ప్రచారం, ఎమర్జన్సీ కాలంలో వాస్తవాలను, సమర్ధవంతంగా వ్యాప్తి చేయగలిగింది. దీనిఫలితంగా బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల గురించి ప్రచారమైన కథనాలు దేశవ్యాప్తంగా, ముఖ్యంగా ఉత్తర భారతంలో, ఇందిరాగాంధీ, ఆమె కుమారుడు సంజయ్ గాంధీ ప్రతిష్ఠను తీవ్రంగా దెబ్బతీశాయి. ప్రభుత్వ కుటుంబ నియంత్రణ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులకు ‘లక్ష్యాలను’ నిర్దేశించారు. చాలా ప్రదేశాల్లో వారు గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేదలు, నిర్లక్ష్యరాస్యులను, పెద్ద ఎత్తున కుటుంబ నియంత్రణ ఆపరేషన్లకు గురిచేశారు. భారతదేశం వంటి దేశంలో, జనాభా నియంత్రణ అనేది ఒక మెచ్చుకోదగ్గ లక్ష్యమే. కానీ ఒక మంచి ఆలోచన ఆదుపు తప్పడం, దాన్ని బలవంతంగా అమలు చేయడం వల్ల చెడ్డపేరు రావడం అనేదానికి ఇదొక గొప్ప ఉదాహరణ.]

సుబ్బలష్షిమి:
బావా! అద్వానీ తన ఆత్మకథలో... ఎమర్జన్సీ కాలంలో ప్రభుత్వం, ఉద్యోగులకు కుటుంబనియంత్రణ కార్యక్రమంలో లక్ష్యాలను నిర్దేశించిందనీ, దాని మూలంగా చాలా ప్రాంతాల్లో పేదలు, నిర్లక్ష్యరాస్యులకు పెద్ద ఎత్తున ఆపరేషన్లు చేశారనీ, అందుమూలంగా ఇందిరాగాంధీ,ఆమె కుమారుడు సంజయ్ గాంధీ అప్రతిష్ఠ పాలయ్యారనీ వ్రాసాడు. ఆ నేపధ్య పరిస్థితుల గురించి ఇంకేమీ వ్రాయలేదు చూశావా?

సుబ్బారావు:
అంతేకాదు మరదలా! అప్పట్లో దేశంలో.... హిందూ జనాభాతోనూ, ముస్లిమేతర జనాభాతోనూ పోల్చుకుంటే.... ముస్లిం జనాభా విపరీతంగా పెరిగి పోతుండేది. అది అందరిలో, అంతర్లీనంగా, ఎంతగానో ఒత్తిడి కలిగించింది. ఒకవర్గం ప్రజల సంఖ్య పెరగటం.... సామాజిక అసమతుల్యతలకి దారి తీస్తుందన్న ఆందోళన, సర్వత్రా ఉండేది. తమ మత విశ్వాసాలకు విరుద్దం అంటూ, మసీదులూ ముల్లాల తోడ్పాటుతో, ముస్లింలు, ఏ సామాజిక సమస్య పరిష్కారానికీ సహకరించే వాళ్ళు కాదు. ఖురాన్ ప్రకారం వడ్డీ వ్యాపారం తప్పు. అయినా ఆ విషయంలో ఖురాన్ కు వ్యతిరేకంగా ప్రవరిస్తారు గానీ, సామాజికాంశాల విషయంలో ప్రవర్తించరు. అంతగా అమాయక ముస్లింల మీద ముల్లాల ప్రభావం ఉండేది.

ఎమర్జన్సీ కాలంలో.... పేదలు, గ్రామీణులకి బలవంతంగా ఆపరేషన్లు జరిగాయనీ, అందులోనూ 11 ఏళ్ళ పిల్లలకి సైతం బలవంతంగా ఆపరేషన్లు చేశారనీ, అలాంటి వాళ్ళల్లో ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్నారనీ.... ఎమర్జన్సీ అనంతరం ఆనాటి పత్రికలు.... ఫోటోలూ, వ్యక్తిగత ఇంటర్యూలూ ప్రచురించాయి. ఆ విధంగా ఇందిరా గాంధీని, సంజయ్ గాంధీని ఈ పత్రికలు టార్గెట్ చేసాయి మరదలా!


అద్వానీ హిందుత్వవాది. అయినా గానీ, ఇదేమీ ప్రస్తావించకుండా, ఎంతో అందంగా, తన వెర్షన్ మాత్రమే వ్రాసాడు. దాదాపు అతడి ఆత్మకథ అంతా ఏకపక్షమే!

సుబ్బలష్షిమి:
అంతేలే బావా! వ్యక్తి నిరపేక్షంగా వ్రాయటానికి అద్వానీ ఏమైనా పీవీజీనా?

1 comment: