Monday, June 14, 2010

‘ఆ! నాలుగు రోజులు ఏడ్చి వాళ్ళే నోర్ముసుకుంటార్లే!’

[శాంతి భద్రతల పరిరక్షణ కోసం, అండర్సన్ ను అర్జున్ సింగే పంపారు - ప్రణబ్ ముఖర్జీ వెల్లడి నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! భోపాల్ దుర్ఘటన జరిగిన నాలుగు రోజులకే, ఇండియాకి వచ్చిన యూనియన్ కార్బైడ్ నాటి సీఈవో అండర్సన్ ను, భద్రంగా వెనక్కి పంపించడం గురించి.... 1984, డిసెంబరు 8వ తేదీన అర్జున్ సింగ్ ప్రకటన, నాటి ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ లో వచ్చిందట. అందులో అర్జున్ సింగ్ "భోపాల్ లో శాంతిభద్రతల సమస్య తీవ్రంగా ఉంది. ప్రజలు ఉద్రేకంలో ఉన్నారు. అందుకే అండర్సన్ ను దేశం నుండి పంపించేయాలనే ఆలోచన చేశాం" అని పేర్కొన్నాడట.

నాకు తెలియక అడుగుతాను బావా! ఆప్తుల ప్రాణాలు కోల్పోయి, కడుపుమండిన ప్రజలు ఉద్రేకంలో ఉండక ఎలా ఉంటారు? అండర్సన్ ను దేశం నుండి పంపించేస్తే ప్రజలు శాంతిస్తారా, తీహార్ జైలు కి పంపిస్తే శాంతిస్తారా? ‘ఆ! నాలుగు రోజులు ఏడ్చి వాళ్ళే నోర్ముసుకుంటార్లే’ అనుకొని అండర్సన్ ని అమెరికా పంపేసారన్న మాట. ఎంత చులకన బావా భారతీయులంటే?

సుబ్బారావు:
ఆ విషయంలో మెరుపుల మరకలు మరిన్ని ఉన్నాయి మరదలా! మరో విషయం చూడు! నిన్నటి దాకా.... "అర్జున్ సింగే మౌనం వీడాలి" అన్నారు అందరూ. అతడేమో తీరిగ్గా "సమయం వచ్చినప్పుడు నోరు విప్పుతా!" అన్నాడు. నాలుగు రోజులు గడిచాక ఇప్పుడు, ప్రణబ్ ముఖర్జీ, అర్జున్ సింగ్ ని వెనకేసుకు వస్తున్నాడు. ఆపైన మన్మోహన్ సింగ్ మరో కమిటీని వేసి, "నివేదిక ఇవ్వండి" అన్నాడు. మరో నాలుగు రోజుల గడిస్తే అన్నీ హుహ్ కాకి!

సుబ్బలష్షిమి:
నిజమే బావా! ఆనాటి శిశుపాలుడి తప్పుల్ని, వంద వరకూ లెక్కిస్తూ ఉపేక్షించాడు శ్రీకృష్ణ భగవానుడు. ఈనాటి సామూహిక శిశుపాలుళ్ళ తప్పుల్ని, ఎన్నిటిని లెక్కపెట్టాలో సామాన్యులు?

No comments:

Post a Comment