[>>>1976 ఎమర్జన్సీ పాలన కూడా అంతమవుతుందన్న సూచనలు కనబడసాగాయి. దేశంలో ఇందిరాగాంధీ పట్ల ప్రజా వ్యతిరేకత రోజు రోజుకి పెరగనారంభించింది. అంతర్జాతీయంగా ఆమెకు సోవియట్ యూనియన్, దాని కీలుబొమ్మ ప్రభుత్వాలు తప్ప మరే మద్దతుదారులు మిగల్లేదు. కట్టుదిట్టమైన పత్రికా సెన్సార్ షిప్ గురించి వేగంగా వ్యాప్తి చెందడంతో ప్రధానమంత్రి ఆందోళనకు గురయ్యారు. మౌఖిక ప్రచారానికి (Mouth Palmplate) ఉన్న శక్తిని గమనించినప్పుడల్లా నాకెంతో ఆశ్చర్యం కలుగుతుంది. నియంతలు ముద్రిత అక్షరం కంటే ఎక్కువగా మౌఖిక ప్రచారానికే భయపడతారు. ఈ ప్రచారాన్ని సెన్సార్ చేయడంలో వారు విఫలమవుతారు. ఆదిమకాలం నుండి ప్రాచుర్యం చెందిన ఈ మౌఖిక ప్రచారం, ఎమర్జన్సీకాలంలో వాస్తవాలను సమర్ధవంతంగా వ్యాప్తి చేయగలిగింది. - అద్వానీ ఆత్మకథ నుండి, పేజీ. నెం.214]
సుబ్బలష్షిమి:
బావా! ఎమర్జన్సీ కాలంలో జరిగిన ఎన్నో దారుణాలు గురించి, మౌఖిక ప్రచారం వాస్తవాలను సమర్ధవంతంగా వ్యాప్తి చేయగలిగిందట! ఎమర్జన్సీ కాలంలో, మీడియా మీద ప్రత్యక్ష నియంత్రణ ఉన్నప్పటికీ కూడా, మౌఖిక ప్రచారం అంత సమర్ధ వంతంగా పనిచేసినప్పుడు, ఇప్పుడు పనిచేయలేక పోతోందేం బావా?
ఈ మౌఖిక ప్రచారం, ఇప్పుడు, అధిక ధరల గురించి, మద్యపుటేరుల గురించి, రాజకీయుల అధికారుల అవినీతి గురించి... సమర్ధంగా పనిచేయలేక పోతోందేం!
సుబ్బారావు:
అంతే మరదలా! అద్వానీలు, సోనియాల వెనకనున్న గూఢచర్య శక్తి ప్రచారించదలుచుకుంటే, అప్పుడు మీడియా కంటే మౌఖిక ప్రచారం బలమైనదై పోతుంది. లేకపోతే ప్రజలు మొత్తుకుంటున్నా....
అద్వానీలు ‘భారత్ వెలిగిపోతుంది’ అంటారు
మన్మోహనులు ‘వృద్దిరేటు రెండంకెల్లో రంకెలేస్తోంది’ అంటారు
కాంగ్రెస్ నాయకులు ‘ప్రజల కొనుగోలు శక్తి పెరిగి ధరలు పెరిగాయి’ అంటారు
‘ఆనందం ఎక్కువై మద్యం తాగుతున్నారు’ అంటారు. అంతే!
సుబ్బలష్షిమి:
అయితే మీడియా కంటే మౌఖిక ప్రచారం బలమైనదనటం, కేవలం అప్పుడు వేసుకున్న పైకారణమన్నమాట![over leaf reason]
Subscribe to:
Post Comments (Atom)
Plz send these articles,
ReplyDeleteTo the Print Media..
You are wasting your creativity..
Who reads in the Blogs???
Plz send your articles to the Print Media..
ReplyDeleteWho reads in the Blogs???
రామ నరసింహ గారు: మీరు నా బ్లాగులోకి కొత్తగా వచ్చినట్లున్నారు. విమర్శిస్తూన్నదే మీడియాని అయినప్పుడు వాళ్ళెందుకు ప్రచురిస్తారండి?
ReplyDelete