Wednesday, June 16, 2010

రెండింటిలోనూ ఒకటే పోలిక, ఒకటే స్ట్రాటజీ ఎలా సాధ్యం?

[గ్యాంగ్ స్టర్ గంగాధర్! వైద్య విద్యలో అవకతవకలు. ఎంబీబీఎస్ ప్రశ్నలు లీక్! ఎంసెట్ లీక్ వ్యవహారం అందులో చిన్న అంశమే - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! మొన్న ఎంసెట్ పేపర్ లీక్ - హైటెక్ కాపీయింగ్ వ్యవహారం బయటపడింది. ఇప్పుడు ప్రైవేట్ వైద్య కళాశాలలకు, తనిఖీ సమయాల్లో అవసరమైన వైద్య సిబ్బందిగా నకిలీ వైద్యుల్ని సప్లై చెయ్యటంలో పాటు, పీజీ పేపర్ లీక్ లు కూడా చేసే గంగాధర్ అనే వైద్య విద్యార్ది గురించి వార్తలొచ్చాయి. ఇతడి పూర్వాపరాలని న్యూస్ టుడే విచారించగా.... అతడి స్నేహితులు, జూనియర్లు దిగ్ర్బాంతికర వాస్తవాలను వెల్లడించారట తెలుసా?

సుబ్బారావు:
మొత్తానికీ న్యూస్ టుడే ‘పేద్ద’కొండని తవ్వి ‘గోప్ప’ ఎలుకని పట్టింది మరదలా! అక్కడికీ.... కార్పోరేట్ ప్రైవేట్ వైద్య కళాశాలల యాజమాన్యాల ప్రమేయం ఏమీ లేనట్లు, అంతా ఒక్క చేతి మీదగా ‘గంగాధర్ ’ అనే ఈ అనామకుడే అన్నీ చేసేసినట్లు! అచ్చంగా... ముంబైముట్టడిలో పాక్, ఐ.ఎస్.ఐ. , దావూద్ ఇబ్రహీంల ప్రమేయము ఏమీ లేదూ, అంతా హెడ్లీనే చేసాడని అమెరికా, యూపీఏ ప్రభుత్వమూ కలిసి గోలగోల చేసినట్లుగానే!

సుబ్బారావు:
ఎంత విచిత్రం బావా? రెండింటిలోనూ ఒకటే పోలిక, ఒకటే స్ట్రాటజీ ఎలా సాధ్యం?

సుబ్బలష్షిమి:
అన్నిటి వెనకా ఉన్నది ఒకే వ్యవస్థ అయితే, ఎక్కడైనా ఒకటే ముద్ర ఉంటుంది మరదలా!

No comments:

Post a Comment