Monday, June 21, 2010

కాదేదీ కవితకనర్హం - కాదేదీ వ్యాపారానికి అనర్హం!

[అద్దెకు నేస్తాలు
>>>మాస్కో: ఇక్కడి ప్రజలు ఎవర్నీ నమ్మరు..ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఒంటరిగా ఉండాలంటే అక్కడ మరీ కష్టం....ఇక్కడ స్నేహితులను సంపాదించడమూ అసాధ్యమే....ఇవన్నీ ఒకనాటి మాటలు...మరి ఇప్పుడో..! రోజులు మారాయి. చదువు కోసమో, ఉద్యోగం కోసమో అక్కడికి వెళ్లి ఒంటరిగా ఉండాల్సి వస్తే ఏమాత్రం బాధపడనక్కర్లేదు. ఇప్పుడు అద్దె ప్రాతిపదికన మిత్రులు, స్నేహితులు లభిస్తున్నారు.

కొంత మొత్తం చెల్లించి, ఆ స్నేహితులను పార్టీలకు, షాపింగ్‌లకు, సినిమాలకు పార్టీలకు తీసుకెళ్లొచ్చు. ఇలా అద్దె మిత్రులను సమకూర్చేందుకు ఇప్పుడక్కడ ఏజెన్సీలు కూడా వెలుస్తున్నాయి. ఈ మేరకు రోమ్‌నోవ్‌ ఏజెన్సీ, అలిబి ప్రైవేట్‌ సర్వీస్‌ వంటి సంస్థలు కొంత మొత్తాన్ని తీసుకుని మనకు మిత్రులను సమకూరుస్తున్నాయి.

తమ వద్దకు 25-40 ఏళ్ల మధ్య వయస్సున్న మహిళలు ఎక్కువగా వస్తూ స్నేహితులను పరిచయం చేయాల్సిందిగా కోరుతుంటారని అలెగ్జాండర్‌ రోమ్‌నోవ్‌ చెప్పారు. రెండు గంటలపాటు ఓ స్నేహితుడు/స్నేహితురాలితో ఓ కాఫీ షాప్‌లోనో, ఆన్‌లైన్‌లోనో ముచ్చటించేందుకు 16 డాలర్లు చెల్లించాల్సి ఉంటుందని రెంట్‌ఎఫ్రెండ్‌ అనే వెబ్‌సైట్‌ చెబుతోంది. ఈ విధంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవారు స్నేహితులను కొనుక్కుని ఒంటరితనం నుంచి రిలీఫ్‌ పొందుతున్నారు.

అయితే స్నేహితులను పొందడం అనేది మన వ్యక్తిత్వం, ప్రవర్తన మీదనే ఆధారపడి ఉంటుందని 40 శాతం మంది మాస్కోవా వాసులు అంటున్నారు. 'నాకు ఇప్పుడిక్కడ ఎలాంటి ఇబ్బందీ లేదు. చాలా మంది మిత్రులు దొరికారు. ఒంటరిగా ఉన్నానన్న బాధ లేదు' అని రష్యాలోని మరో నగరం నుంచి మాస్కో వచ్చిన మిహాయ్‌లోవా పేర్కొన్నారు.- వార్త నేపధ్యంలో]


సుబ్బలష్షిమి:
బావా, రష్యాలో... రెండు గంటలపాటు ఓ స్నేహితుడు/స్నేహితురాలితో ఓ కాఫీ షాప్‌లోనో, ఆన్‌లైన్‌లోనో ముచ్చటించేందుకు 16 డాలర్లు చెల్లించాల్సి ఉంటుందట. ఈ విధంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవారు స్నేహితులను కొనుక్కుని ఒంటరితనం నుంచి రిలీఫ్‌ పొందుతున్నారట.

సుబ్బారావు:
కాదేదీ కవితకనర్హం అన్నాడు వెనకటికి మహాకవి శ్రీశ్రీ! కాదేదీ వ్యాపారానికి అనర్హం అంటున్నాయి ఈనాటి వ్యాపార సంస్థలు!

సుబ్బలష్షిమి:
మొత్తానికీ... స్నేహ వ్యాపారం మాత్రం గమ్మత్తుగా ఉంది బావా! మన డబ్బుతో సినిమాకి, షికార్లకీ, షాపింగ్ కి తీసికెళ్ళిందే గాక, ఎదురు డబ్బులిస్తే గానీ స్నేహితులు దొరకని స్థితి కాబోలు!

సుబ్బారావు:
అంతే మరదలా! డబ్బు సంపాదనే జీవితం అయితే, చివరికి ఒంటరితనం తప్ప ఏమీ మిగలదు. అప్పుడు స్నేహాన్ని కూడా అద్దెకే వెదుక్కోవాలి.

No comments:

Post a Comment