Thursday, June 24, 2010

శ్రీకృష్ణ కమిటీ బూటకమా? సోనియా నాటకమా?

[సోనియా ఒప్పుకున్నారు. తెలంగాణ ఇచ్చేందుకు అంగీకరించారు - డీ.ఎస్. వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! పీసీసీ అధ్యక్షుడు డీఎస్ ఏమిటీ - ‘సోనియా తెలంగాణా ఇచ్చేందుకు ఒప్పుకుంది’ అంటున్నాడు. వేర్పాటు, సమైక్యవాదాల నేపధ్యంలో, దాని గురించి అధ్యయనం చేయడానికి శ్రీకృష్ణ కమిటీని నియమించారు కదా? డిసెంబరు 2010 లో అది నివేదిక ఇచ్చాక కదా ఏ నిర్ణయమైనా తీసుకునేది? మరి సోనియా తెలంగాణా కి ఒప్పుకుంది/అనుకూలం అంటాడేమిటి?

సుబ్బారావు:
సోనియా మాటే అంతిమ నిర్ణయం అనేటట్లయితే శ్రీకృష్ణ కమిటీ నియామకం, స్థితి అధ్యయనం, వేల సంఖ్యలో నివేదికలు సమర్పణ... అంతా బూటకమే కాబోలు.

సుబ్బలష్షిమి:
ఏది బూటకమో, ఏది నాటకమో తెలియకుండా పోయింది బావా!

5 comments:

  1. మరిప్పుడు ’తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు మేము సుముఖం’ అంటేనే కదా ఓట్లు పడేది... ఓట్లు పడితేనే కదా కాంగ్రెసయినా, తెలుగు దేశమయినా ఒకటో, రెండో సీట్లు గెలుచుకొనేది... ఒకటో, రెండో సీట్లు గెలిస్తేనే కదా రేప్పొద్దున ’తెలంగాణ వాదం వీగిపోయింది’ అని చెప్పగలిగేది... అవన్న మాట... సిగ్గు, ఎగ్గు లేని రాజకీయాలు!

    ReplyDelete
  2. మంచి కథలు ఎక్కువ రాసి .. విమర్శలు తక్కువ రాస్తే బావుంటుందేమో...? .. మీ విమర్శలు చూసి చూసి ఒకే ధోరణి లో పోతున్నారని పిస్తుంది... నడుస్తూ నడిపిస్తే బావుంటుంది..

    ReplyDelete
  3. shayi గారు: అందుకేనేమో గోలిమార్ సినిమాలో గోపిచంద్ "ప్రాణం మీదకొచ్చినప్పుడు నేను లక్ష చెప్తా! నువ్వయన్నీ నమ్మకూడదు" అంటాడు. జనాలు కూడా "ఎన్నికలు వచ్చినప్పుడు పార్టీల వాళ్ళు లక్ష చెప్తారు. మనం అయన్నీ నమ్మకూడదు" అనుకోవాలి.

    Krishna గారు: కథల కోసం అయితే ఈ బ్లాగు కంటే చందమామ మంచి ఎంపిక. ఇక పోతే టపాకాయలలో నేను కథలు వ్రాయను. మరి ఇక్కడెందుకు ఇలా మీరు కామెంటారో!

    ReplyDelete
  4. Krishna గారు: విమర్శలు చూసి చూసి మీకు నేను ఒకే మూసలో పోతున్నట్లు అనిపించింది అన్నారు. నిజానికి వాళ్ళకి తెలిసినవి అవే పది స్ట్రాటజీలు. వాటినే ప్యాకింగ్ మార్చి పదేపదే ప్రయోగిస్తుంటారు. అంచేత మీకలా అనిపించి ఉండచ్చు. ఆపై మీ విజ్ఞత!:)

    ReplyDelete
  5. నేను అన్నది కూడా అదేనండీ.. జరుగుతున్న దాన్ని చెపితే తెలుసుకోగల,అర్థం చేసుకోగల రీతిలో వాళ్ళకి చెప్పారు .. మాకూ ఈ ఒరవడి అలవడింది ... మీలాంటి వారి పుణ్యమా అని ప్రతి సంఘటననూ నిశితంగా పరిశీలించాలనేది నా కైతే అనుభవం అవుతోంది.. ఇక మీ విషయానికొస్తే మీరు కొంచెం రూటు మార్చి విలువలు పెంపొందించే కథల వంటివి చెబితే బాగుంటుంది.. నేను ఎప్పటినుంచో చందమామ రెగ్యులర్ రీడర్ ని..ఇవే విషయాలని మీరు కథల రూపం లో చెప్తే వినాలని... కావల్సినన్ని పాత్ర లున్నాయి... కోట్ల కొద్ది గొర్రెలున్నాయి.. గొర్రెలను పాత్రలు ఎలా ఆడించాయో.... వివరిస్తే బావుంటుంది...

    ReplyDelete