Tuesday, June 15, 2010

బూడిదంటే ఇలాంటి కవరేజీలన్న మాట!

[బెయిల్ పై విడుదల అయిన అనంతరం, ఆదివారం బెంగుళూరులోని తన ఆశ్రమంలో నిప్పుల వలయం మధ్యలో కూర్చొని పంచాగ్ని యాగాన్ని నిర్వహిస్తున్న నిత్యానంద - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! బెయిల్ పై విడుదలయ్యాక ఈ నిత్యానంద, తన ఆశ్రమంలో యాగం నిర్వహిస్తున్నాడట. ఫోటో వేసి మరీ కవర్ చేసింది ఈనాడు పత్రిక! సెక్సు వ్యవహారంలో సాక్ష్యాధారాలతో సహా దొరికిపోయిన ఇతడు తానసలు మగవాణ్ణే కాదంటాడు. సన్యాసి కాడనీ, సర్వసంగ పరిత్యాగి కాడనీ, ఆధ్యాత్మిక బోధనలు మాత్రమే చేస్తాడనీ ఇతడి న్యాయవాదులు వాదించారు. మరో ప్రక్క ఇతడు కాషాయం కడతాడు, రుద్రాక్షలు వేస్తాడు. ఆశ్రమంలో యాగాలు నిర్వహిస్తాడు.

ఇలాంటి వాళ్ళకి కవరేజి ఇచ్చే పత్రికలని ఏమనాలి బావా?

సుబ్బారావు:
అలాంటి కవరేజిలతో.... ఆ నిత్యానంద ఎంత లజ్జాహీనుడో, ఈ పత్రికల వాళ్ళూ అంతే లజ్జాహీనులని నిరూపించుకుంటున్నారు మరదలా!

సుబ్బలష్షిమి:
జోగి జోగి రాసుకుంటే బూడిద రాలుతుందంటారు! బూడిదంటే ఇలాంటి కవరేజీలన్న మాట!

No comments:

Post a Comment