Monday, June 7, 2010

ప్రభుత్వం కూడా ఉందంటే ఉంది, లేదంటే లేదు!

[అఫ్జల్ గురు కేసులో జాప్యానికి శివరాజ్ పాటిలే కారణం. షీలా దీక్షిత్ పై ఒత్తిడి - ఈనాడు వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ‘అఫ్జల్ గురు కేసులో జాప్యానికి శివరాజ్ పాటిలే కారణమా!’ అంటూ వార్త వ్రాసింది ఈనాడు. అసలూ.... ముంబై ముట్టడి సమయంలోనే క్రాపు దువ్వుకోవటం, సూట్లు మార్చుకోవటం తప్ప, మరేం చెయ్యడానికీ చేతగాని శివరాజ్ పాటిల్ కి, ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ని ఒత్తిడి చేయటం మాత్రం ఏం వచ్చు? అతడి కున్న ఏకైక అర్హత, అధిష్టానానికి అతివినయం చూపటమేనయ్యె! అందుకే ముంబై ముట్టడి నాడు అంత కంపు గొట్టినా, అతడికి గవర్నర్ గిరీ కట్టబెట్టింది సోనియా! మరి ఈ పత్రిక వాళ్ళు ఇలా వ్రాసారేమిటి?

సుబ్బారావు:
అయినా అది హెడ్డింగ్ మాత్రమే మరదలా! వార్తాంశంలో ఎక్కడా శివరాజ్ పాటిలే కారణం అని ఎవరూ అన్నట్లుగా పత్రిక వ్రాయలేదు.

సుబ్బలష్షిమి:
అంత డొంక తిరుగుడెందుకు బావా?

సుబ్బారావు:
అఫ్జల్ గురు కేసులో జాప్యానికి అసలు కారణం అధిష్టానమే! సోనియాని కాపాడుకోవటానికే... ఈనాడు, శివరాజ్ పాటిల్ నీ, చిదంబరంలనీ అడ్డం వేస్తూ ఉంటుంది. అందుకే షీలాదీక్షిత్ కూడా చూడు, ఎంత అడ్డదిడ్డంగా జవాబు చెప్పిందో! ‘రాజకీయ ఒత్తిడి ఉందంటే ఉందిట, లేదంటే లేదట.’

సుబ్బలష్షిమి:
అవును మరి! అసలు ప్రభుత్వం కూడా ఉందంటే ఉంది, లేదంటే లేదు!

No comments:

Post a Comment