Thursday, June 24, 2010

అతడు పాక్ కు అనుకూలం - ఇతడు భారత్ కు వ్యతిరేకం!

[ప్రపంచంలోని తొలి నాగరికతలకు సింధ్ ప్రాంతం ఆశ్రయం ఇచ్చింది. బ్రిటీష్ కాలంలో హరప్ప మొహంజదారుల్లో జరిగిన తవ్వకాల్లో ఇందుకు భౌతిక సాక్ష్యాలు లభిస్తాయి. లార్కానా నుండి 20 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఈ శిధిలాలు ప్రాచీన కాలంలో స్థిర పట్టణ నివాసాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో తెలియజేస్తాయి. ఈ పట్టణ ప్రజలు తల్లిని, మాతృత్వ చిహ్నాలైన దేవతలను పూజించారు. స్వర్గీయ జుల్ఫికర్ ఆలీ భుట్టో(భుట్టో తల్లి హిందువు), ఆయన దివంగత కూతురు బేనజీర్ భుట్టో భారతదేశంలో ప్రముఖ న్యాయకోవిదులు రాంజెత్మలానీ కూడా లార్కానాలో జన్మించిన వారే!]

సుబ్బలష్షిమి:
బావా! ప్రముఖ న్యాయవాది రాంజత్మలానీ కూడా.... అద్వానీ మన్మోహన్ సింగ్ ల లాగే, పాకిస్తాన్ నుండి, దేశ విభజన సమయంలో, భారత్ కు వలస వచ్చిన వాడేనట తెలుసా?

సుబ్బారావు:
అదా సంగతి! ఇతడూ కులదీప్ నయ్యర్ కోవకి చెందిన వాడేనన్న మాట! ఆ సీనియర్ పాత్రికేయుడు పాకిస్తాన్ కి అనుకూలంగా వ్రాస్తుంటాడు. ఈ సీనియర్ న్యాయవాది భారత్ కు వ్యతిరేకంగా వాదిస్తుంటాడు.

1 comment: