Tuesday, November 23, 2010

భలే కలరింగ్ ఇచ్చుకుంటున్నాడే రామోజీరావు, సోనియాకి!

[ఆగ్రహం…అయినా నిగ్రహం. జగన్ పై ఇదీ అధిష్టానం వైఖరి, రెచ్చగొట్టినా రెచ్చిపోకూడదని నిర్ణయం – `ఈనాడు' వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! వై.యస్. జగన్ కు చెందిన సాక్షి టీవీలో సోనియాకి… స్విస్ బ్యాంకుల్లో వ్యక్తిగత ఖాతాలున్నాయనీ, ఆమె ప్రజలని ఆకట్టుకునేలా ప్రసంగించేంత వక్త కాదనీ, ఆమెకి ఇతరత్రా నైపుణ్యాలేవీ లేవనీ, ఆమె ‘రాష్ట్రపతి కాదు, ప్రధానమంత్రి కాదు అయినా గానీ ప్రభుత్వాన్నీ రాజకీయాలనీ శాసిస్తోందని’ కథనాలు ప్రసారం చేయబడ్డాయట. దాని మీదట సాక్షి సంస్థల ముంగిట సోనియా అనుయయూలు ధర్నాలు చేస్తే, జగన్ అభిమానులు ప్రతిధర్నాలు చేస్తున్నారు.

ఈ నేపధ్యంలో…జగన్ పట్ల అధిష్టానం [అంటే సోనియా] ఆగ్రహం వచ్చినా నిగ్రహించుకుంటోందట, రెచ్చగొట్టినా రెచ్చిపోకూడదని నిర్ణయించుకుందట, ఎందుకంటావూ?

సుబ్బారావు:
రెచ్చిపోతే పుచ్చిపోతుందని అధిష్టానానికీ తెలుసు మరి! కాబట్టి, సహనం తెచ్చుకోక… పీక మీదికి తెచ్చుకుంటుందా? సంవత్సరం నుండి నిగ్రహంతోనే ఉన్నది మరి! ఈ విషయమై దాదాపు సంవత్సరం క్రితమే ‘అమ్మఒడి’ వివరించింది కూడా!

[226. జగన్ శిబిరానికీ, కాంగ్రెస్ అధిష్టానానికీ మధ్య సాగుతున్న అంతర్లీన పోరు – 01 [ద్విముఖ వ్యూహం][Oct. 10, 2009]
http://ammaodi.blogspot.com/2009/10/blog-post_10.html ]

సుబ్బలష్షిమి:
మొత్తానికీ, భలే కలరింగ్ ఇచ్చుకుంటున్నాడన్న మాట రామోజీరావు తన అనుంగు అనుయాయురాలు సోనియాకి!
~~~~~

4 comments:

  1. $భలే కలరింగ్ ఇచ్చుకుంటున్నాడన్న మాట రామోజీరావు
    మొదట అర్ఠం కాలేదు, ఇది "ఈనాడు" వార్త అని. "ఈనాడు" ని ఇలా double quotes లొ పెడితే వీజీగా అర్ధం అవుతదేమో? :)

    $రెచ్చిపోతే పుచ్చిపోతుందని అధిష్టానానికీ తెలుసు మరి!
    :)) truly 200%

    ReplyDelete
  2. Lakshmi garu,

    I was following your blogs ammaodi, tapakaya and ofcourse anaganaga.

    The posts in ammaodi were very interesting. But i had a doubt all the time reading them.

    But these days, many thigs are happening in AP as well as in INDIA that are as same as you have described.

    I am eagerly waiting to see more about 'tella kaki'

    Keep writing.
    Praveen Kumar

    ReplyDelete
  3. Please see this video.

    http://www.youtube.com/watch?v=56viHV3bwyo

    http://www.facebook.com/indiamediawatch

    ReplyDelete
  4. సర్కులేషన్+ప్రభుత్వ ప్రకటనలు ..పెరుగుతాయాని ...

    ReplyDelete