Thursday, February 26, 2009

ఆడపిల్లల్ని ’పడేయటం’ ఎలా

[ఆడపిల్లల్ని ’పడేయటం’ ఎలా అంటూ 9 ఏళ్ళ అలెక్ గ్రెవిన్ ఓ పుస్తకం వ్రాసాడు. అది హాట్ కేక్ లా New York Times best seller గా అమ్ముడుపోతోంది – వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
తొమ్మిదేళ్ళ కుర్రాడు ఆడపిల్లల్ని పడేయటం అన్న పుస్తకం వ్రాయటం ఎలా సాధ్యం బావా?

సుబ్బారావు:
ఆ, ఏముంది! చదువుకోవలసిన వయస్సులో ‘నచ్చావులే’, ‘చిత్రం’, ‘మనసంతా నువ్వే’లాంటి ఇంగ్లీషు సినిమాలు చూసి రాసుంటాడు. చదువుకొనే వయస్సులో ఇవేం పనులని తల్లితండ్రులు, టీచర్లూ నాలుగు పీకటానికి అక్కడి చట్టాలు అడ్డం వస్తాయి కదా?

సుబ్బలష్షిమి:
అయితే మన దేశంలోకి కూడా అలాంటి చట్టాలు తెస్తున్నారు కదా! అప్పుడు మన దేశంలో కూడా అలాంటి పుస్తకాలు రాసే బాల మేధావులు వస్తారన్న మాట!

సుబ్బారావు:
పిల్లలు అలా చెడిపోవాలనే కదా అలాంటి చట్టాలు, సినిమాలు వచ్చేది! పిల్లలు బాగుపడితే దేశం బాగుపడిపోదూ?

*********

4 comments:

  1. ఈ మాత్రం దానికి పుస్తకాలు కూడానా, కాలు లాగేస్తే చాలదా :)

    ReplyDelete
  2. పిల్లలు అలా చెడిపోవాలనే కదా అలాంటి చట్టాలు, సినిమాలు వచ్చేది! పిల్లలు బాగుపడితే దేశం బాగుపడిపోదూ?

    అవును కదా మరి

    ReplyDelete