Wednesday, March 4, 2009

58. బొంకరా బొంకరా పోలిగా అంటే టంగుటూరి మిరియాలు తాటికాయలంత అన్నాట్ట

[లంక క్రికెటర్లపై దాడుల వెనుక భారత్ హస్తం, ఉగ్రవాదులు అక్కడి నుంచే వచ్చారు: పాక్ షిప్పింగ్ శాఖ సహాయమంత్రి సర్ధార్ నబిల్ అహ్మద్ ఆరోపణ వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
చూశావా బావా! పాక్ లో లంక ఆటగాళ్ళు మీద దాడి వెనుక భారత్ హస్తం ఉందిట. ఉగ్రవాదులు ఇక్కడి నుండే వెళ్ళారనీ, ముంబాయి దాడులకి ప్రతిగా ఈ కుట్ర పన్నారనీ పాక్ మంత్రి అంటున్నాడు. ఇంకా నయం! 2001, సెప్టెంబర్ 11న అమెరికా WTC మీద విమాన దాడి చేసిందీ, 2007 డిసెంబర్ లో పాక్ లో బేనజీర్ ని హత్య చేసిందీ భారతీయులే అనలేదు, కదు బావా?

సుబ్బారావు:
‘బొంకరా బొంకరా పోలిగా అంటే టంగుటూరి మిరియాలు తాటికాయలంత అన్నాట్ట’ అన్న సామెత ఇలాంటి పాక్ మంత్రిని చూసే మన వాళ్ళు చెప్పిఉంటారు మరదలా!

***************

2 comments:

  1. ఇదేమాట నేను క్రికెటర్ల మీద దాడి జరిగిందని టివిలో చూపిస్తున్నప్పుడే మావారితో అన్నాను. అదే నిజమైంది. వినేవాళ్లు ఉంటే ఎన్నైనా చెప్తారు...

    ReplyDelete