[మన్మోహన్ సంకల్ప బలం అణుఒప్పందంలో చూడలేదా? - ప్రధానికి రాహుల్ గాంధీ మద్దతు, వార్త నేపధ్యంలో]
సుబ్బలష్షిమి:
బావా! 2008 లో అణుఒప్పందం కోసం మన్మోహన్ సింగ్ ‘బుష్ కి ముఖం ఎలా చూపించను’ అంటూ కుమిలిపోయి, హడావుడి పడిపోయి, అమెరికాకి పరుగున పోయిన నేపధ్యంలో, నాకైతే అతడి ఆత్రం కనబడింది గానీ సంకల్పబలం కనబడలేదు. ఇంతకీ సంకల్పబలం అంటే ఏమిటి బావా?
సుబ్బారావు:
ఏమో మరదలా! ఈ పేపరు వాళ్ళ వ్రాతలు, రాజకీయ వేషగాళ్ళ వ్యాఖ్యానాలు చదివి అన్ని పదాల అర్ధాలు, నిర్వచనాలు మరిచిపోయాను. ఎవరన్నా ఈ కొత్త అర్ధాలతో, కొత్త నిఘంటువు వ్రాస్తే బాగుణ్ణు.
******
ఈ టపాకాయ మిరియాల శ్రీ సత్య భ్రమరార్జున ఫణి ప్రదీప్ కు నా ఉగాది కానుక. Te2EnDict. నిఘంటువు విడుదల సందర్భంగా నా శుభాకాంక్షలు.
సూచన: వెయ్యిమంది ప్రదీప్ లయినా పేపర్ల వ్రాతల్లోనూ, రాజకీయ నాయకుల మాటాల్లోనూ వాడే పదాలకు స్థిరమైన కొత్త నిర్వచనాలు, అర్ధాలతో నిఘంటువులు కూర్చలేరు గాక కూర్చలేరు.
***********
Subscribe to:
Post Comments (Atom)
:) ఒక రాజకీయ నిఘంటువు విడుదల చెయ్యాలేమో నేను !!!
ReplyDeleteవెంటనే ప్రయత్నం ప్రారంభించు. Best of luck Pradeep.
ReplyDelete